• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sabarimala Kerala Alaya Samajika Charitra

Sabarimala Kerala Alaya Samajika Charitra By Jitish Pm , K Satya Ranjan

₹ 110

ప్రచురణకర్తల మాట

శబరిమల అయ్యప్ప - ఈ పేర్లు దక్షిణ భారతదేశంలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేనివి. శబరిమల క్షేత్రం కాని, అయ్యప్ప పూజా విధానం కాని ఇతర పుణ్యక్షేత్రాలు, దేవుళ్లకు పూర్తి భిన్నమైనది. అయ్యప్పను దర్శించేవాళ్లు ముందు నలభై ఒక్క రోజుల దీక్షబూనాలి. ఆ సమయంలో పూర్తి అహింసాయుతంగా గడపాలి. పాదరక్షలు ధరించ కూడదు, పూర్తి శాకాహారాన్ని భుజించాలి. మద్యాన్ని ముట్టుకోకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దీక్షబూనిన ఇతరులతో కలిసి కులమతాలకు అతీతంగా సమానంగా ఉండాలి. సామూహిక ప్రార్ధనలు చేయాలి, సామూహికంగా భుజించాలి. అయ్యప్ప దర్శనానికి సైతం సామూహికంగా బయలుదేరాలి. దీక్ష సమయంలో పాటించిన ఈ అలవాట్లు అయ్యప్పల తర్వాతి జీవితంలో సైతం సత్ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అందుచేతనే అయ్యప్ప దీక్షకు, శబరిమలకు ఇంతటి ప్రాచుర్యం లభించింది.

కాని ఇంతటి విశిష్టమైన శబరిమలకు కేవలం పురుషులు మాత్రమే వెళ్ళాలి. నెలసరి వయసులో ఉన్న మహిళలు శబరిమలను సందర్శించడం నిషిద్ధం. సరిగ్గా ఈ అంశంపైనే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దీనికి మూలం శబరిమలకు స్త్రీల ప్రవేశాన్ని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. గతంలో కేరళ హైకోర్టు దైవాన్ని ఎలా పూజించాలన్నది మతపరమైన అంశం. ఎవరి ఇష్టం వారిది. దానిలో జోక్యం చేసుకునే హక్కు ఎవ్వరికీ లేదు అని తీర్పు ఇచ్చి శబరిమలలో మహిళల ప్రవేశ నిషేధాన్ని ధృవీకరించింది. కాని సుప్రీం కోర్టు ఇది మహిళల పట్ల వివక్షతను ప్రదర్శించడం, అంటరానితనాన్ని పాటించడంతో సమానం అని పేర్కొంటూ శబరిమలకు మహిళల ప్రవేశాన్ని అనుమతించింది.

సుప్రీం తీర్పుపై మతవాద, ఛాందస శక్తులు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టాయి. కేరళ రాష్ట్రంలోను, దేశవ్యాపితంగా సైతం నిరసన ప్రదర్శనలకు పూనుకున్నాయి. ప్రధానంగా ఆరెస్సెస్, సంఘపరివార్ శక్తులు ఈ ఆందోళనల వెనక ఉండి నడిపించాయి...............

  • Title :Sabarimala Kerala Alaya Samajika Charitra
  • Author :Jitish Pm , K Satya Ranjan
  • Publisher :Navatelangana Publishing House
  • ISBN :MANIMN6509
  • Binding :Papar Back
  • Published Date :July, 2024
  • Number Of Pages :112
  • Language :Telugu
  • Availability :instock