• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sadhakulu Bodhakulu

Sadhakulu Bodhakulu By Chukka Ramaiah

₹ 520

తరగతి - గురుతర బాధ్యత

మనిషికి వినటానికి చెవులిచ్చాడు. ఒక నోరిచ్చాడు. కాబట్టే విద్యాభ్యాసం కూడా . ఇదే నిష్పత్తిలో జరగాలి. అనగా 45 నిమిషాలు మాట్లాడే అధికారమే ఉపాధ్యాయునికున్నదనుకోవటం పొరపాటు. ఎక్కువ వినాలి. ఉపాధ్యాయుల మాటలతో విద్యార్థుల మేదస్సు కణాలను తెరుచుకుంటాయి. ఆద్వారాల గుండా వచ్చే జ్ఞానం. పుస్తకాల నుంచి వచ్చే జ్ఞానం కన్నా ఎన్నో రెట్లు పెద్దది. పుస్తకాలలో ఉండే జ్ఞానం వండిన వంట. పిల్లలనుంచి వచ్చే జ్ఞానం రాబోయే పుస్తకాలకు సమాచారాన్ని సమకూర్చుతాయి. విద్యార్థి వాటిని ప్రాతిపదిక చేసుకుని ఉపాధ్యాయుని మాటలతో సమన్వయ పరుచుకుని కొత్తజ్ఞానాన్ని అల్లుతాడు. అవి ప్రామాణికమైన గ్రంథాలు కాకపోవచ్చును. ఆలోచనల అంకురార్పణ ఎలా జరుగుతుందో తెలుస్తుంది. ఆ భావాలను ఉపాధ్యాయుడు విశ్లేషిస్తాడు. ఉపాధ్యాయుడు ఆ భావాలను చెక్కి కొత్త బాటలను వేస్తాడు. ఆ బాటల్లో విద్యార్థి నడిచి శ్రమించి కొత్తజ్ఞానానికి ప్రాతిపదిక చేస్తారు. ఇదే గురువుకు శిష్యునికి మధ్యనున్న బంధం. జ్ఞానాన్ని గురువు సృష్టించాడా? శిష్యుడు సృష్టించాడా? అని అడిగితే? ఇది సృష్టికర్తలేని జ్ఞానం. అదే తరగతి యొక్క రహస్యం.

సృష్టికర్తప్రధానం కాదు. సృష్టికర్త కన్నా దాని వెనకున్నటువంటి ఉభయులు శ్రమ దాగి ఉంటుంది. ఆ జ్ఞాన సృష్టికర్తలు పిల్లలేనని టీచర్ అంటారు. పిల్లలేమో అది టీచర్ నంటారు. కానీ, ఫలితం మాత్రం సమాజానిది గురుపుజా ఉత్సవం అంటే ఇద్దరి యొక్క శ్రమకు భక్తిపూర్వకంగా నమస్కరించటమే. సర్వేపల్లి రాధాకృష్ణన్ తన కనపడని పుట్టుక రోజును రాబోయే సమాజనిర్మాణం కోసమై అంకితం చేశాడు. ఇదే ఎడతెగకుండా జరుగుతున్న కార్యక్రమం. దానికి ఆదీ అంతము ఉండదు. గురుశిష్యుల సంబంధాలకు సర్వేపల్లి జన్మదినం సంకేతం.................

  • Title :Sadhakulu Bodhakulu
  • Author :Chukka Ramaiah
  • Publisher :Adugu Jadalu Publications
  • ISBN :MANIMN5924
  • Binding :Papar Back
  • Published Date :2019
  • Number Of Pages :520
  • Language :Telugu
  • Availability :instock