అనుభవసందేశము
అనేక ముద్రణలపొంది, తెలుగులున్న దేశదేశాలతిరిగి, 'సాధకుల కల్ప తరువు' అని, 'సాధక వాఙ్మయగురువు' అని, అసంఖ్యాకంగా సంస్తుతుల్ని సంపాదించిన మన 'సాధనరహస్యం', ఆధ్యాత్మికజిజ్ఞాసగల చిన్న అమ్మాయికి వ్రాయబడినా, పెద్దలకుకూడా అదియే 'ఉపయోగకరంగా' వెలుగొందటం, 'పండితులకే కాకుండా పామరులకుకూడా ఆధ్యాత్మిక విషయపరిజ్ఞానం అందుబాటులో ఉండాలనే లక్ష్యం' సిద్ధింపచేసుకోటం 'వ్యావహారికం అనర్గళప్రవాహంలాగా సాగిపోతూ పాఠకులలో బాగా అభిరుచిని కలిగిం చడం, 'ముచ్చటైన వ్యావహారికభాషతో ఎంతో సరళత్వం సాధించి కృత కృత్యురా' లవటం, 'పఠనానంతరం ఏవేదాంత గ్రంథములైనను చేసుకొనుట సులభసాధ్యము కాగలటుల చేయడం, ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రచారం చేస్తున్నవారుగాని, యితరులుగాని యిలాంటి గ్రంథాలను ప్రచురించి యుండలే' దనియు, 'సాధకునకవసరమై; సర్వవిషయాలు, పండొలిచి.....................