“వాట్స్ ద హెల్ యూ ఆర్ స్పీకింగ్?" అని అతను గట్టిగా అరుస్తూ లేచాడు “నాకు గ్రాడ్యుయేట్ అవుతున్నకొడుకున్నాడుయూ.ఎస్ లో. నేనూ నా భార్యా ఇంకాసేప్పట్లో బయల్దేరి వెళ్ళ బోతున్నాంఇప్పుడు
నాకో ఇల్లీగల్ చైల్డ్ అవసరమా?... రేపు లోకానికి ఏం చెప్తావు? నా లైఫ్ నీ లైఫ్ రుయిన్• చేస్తావా? నా కొడుక్కి తెలిస్తే వాడి కళ్ళల్లోకి నేను చూడగలనా? నా భార్య ఇది వింటే పిచ్చిదైపోతుంది. ఆ అమాయకురాలికి ఇంతశిక్ష అవసరమా?”.అతను ఫుల్ కోపంతో అరుస్తున్నాడు. నేను ఆ కోపానికి షాక్ అయి రాయిలా కూర్చుని చూస్తూండిపోయాను.“విరాట్.. నా జీవితం ఇంతేనా? నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరున్నారు? కడుపున పుట్టిన ఒక బిడైనా వుండద్దా?” అతికష్టంమీద శక్తి కూడదీసుకుని అడిగాను.
విరాట్ వచ్చి నా గెడ్డం ఎత్తి నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు
"పెళ్ళి చేసుకో.. బిడ్డను కను. నీకింకా వయసుంది. అందం వుంది. అందర్నీ సమ్మోహితులని చేసే కళ వుంది!”
అంటే... అతి తేలికగా నన్ను వదిలేస్తా అని చెప్తున్నాడు. ఈ ఎనిమిది సంవత్సరాల అనుబంధానికి ఎక్కడా రాతపూర్వకమైన ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ లేవు! విడిపోడానికి విడాకులు తీసుకోనవసరం లేదు! ఎంతో మామూలుగా "వెళ్ళి పెళ్ళిచేసుకో' అంటే... నేను పవిత్రం అయిపోతానా? నా మనసులో.ఇంకొకడికి చోటు ఇవ్వగలనా? నా మనసుకి ఎటువంటి విలువా లేదా? ఏమిటి జరుగుతోంది? నిశ్చేష్టురాలినైపోయాను.