రంగం సిద్ధమైందిలా..
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ డి.ఆర్.కార్తికేయన్ నా సన్నిహిత మిత్రులలో ఒకరు. ఒకసారి మేము ఇద్దరం కలిసి చెన్నై నుంచి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నాం. విమానం గాలిలోకి లేచిన తర్వాత మా సంభాషణ మొదలయింది. కైలాష్ నుంచి ప్రసాదం నాకు అందజేస్తూ కార్తికేయన్ అన్నారు: “భారతీయ వైద్యులు పాశ్చాత్యదేశాలలో వైద్యులకు తీసిపోతారని నేను అనుకోను. భారతీయ వైద్యులకు పనికొచ్చే పుస్తకాలను మీలాంటి వారు ఎందుకు రాయరు?”
ఆయన మాటల్లో, కళ్ళల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆయన ఇంకా ఇలా అన్నారు: "డాక్టర్ గారూ, ఇండియాలో విజ్ఞానం కలిగిన వ్యక్తులకు కొదవ లేదు. ఆ జ్ఞానాన్ని పంచుకునే విషయం వచ్చేసరికి మనం గోప్యం పాటిస్తాం. ఈ జాతి లక్షణం అది. మన పూర్వీకులు గొప్ప రుషులు వేద విజ్ఞానాన్ని తమ దగ్గరే ఉంచుకున్నారు. అది ఒక తరగతివారికే పరిమితమైంది. మహిళలకూ, దిగువ తరగతులవారికీ అందుబాటులోకి రాలేదు.” కార్తికేయన్ మాటలు వింటున్న నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. తర్వాత మనఃస్ఫూర్తిగా నవ్వాను.
"డాక్టర్ పళనివేలూ, దయజేసి నా సలహాను మనసుకు పట్టించుకోండి" అని కార్తికేయన్ అన్నారు. ఆయన మనసు కష్టపెట్టుకున్నారా? నేను నా హేండ్ బ్యాగ్ తెరచి నేను రాసిన పుస్తకాన్ని బయటికి తీశాను. 'ది ఆర్ట్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీ - టెక్స్ట్ బుక్ అండ్ అట్లాస్. అది 2006లో ప్రచురించాం. కార్తికేయన్ మొదట పేజీలు తిప్పుతూ పోయారు. తర్వాత ఆసక్తి పెరిగినట్టు కనిపించింది. బొమ్మలకేసి తదేకంగా చూస్తూ పోతున్నారు. కళ్ళ నిండా సంతోషంతో నన్ను చూశారు. “ఓహ్. నేను ఎంత మందబుద్ధిని! మీరు అంతర్జాతీయ స్థాయి పుస్తకం రాశారని తెలియక మిమ్మల్ని పుస్తకం రాయమని అడుగుతున్నాను. సారీ. నేను తప్పు చేశాను" అంటూ..................................