ఉపజ్ఞ
కథలెలా వస్తాయి?
కథ వెనక కథలేమిటి?
కథల మీద కథలు కూడా కథలేనా?
నా అభిమాన కథకుడెవరు?
కథలు జీవితంలోంచి వస్తాయి. నిత్యజీవితంలోంచి, నిజజీవితంలోంచి. ఊహల్లోంచి కూడా వస్తాయి. కాని వాటి వేర్లు మళ్లీ నిజజీవితంలోనే వుంటాయి.
'నిజం కానిదే కావచ్చును, కవితకు ఖనిజం, కాని కథకు మాత్రం నిజం ఖనిజం' అని రాసేనోసారి. అంచేత కథల కథలన్నీ కథలే!!
నా అభిమాన రచయిత, ఆదర్శ రచయిత ఒకరు కాదు, ఎందరో ఉన్నారు. అందరూ ఒకళ్లతో ఒకళ్ళు కలిసి పోల్చుకోలేని విధంగా మారి నాలా వున్నారు. నాలో వున్నారు. వీళ్లు ఒక్క వాక్యం వల్లో, ఒక రచన వల్లో, ఒక పుస్తకం వలనో నాకు నచ్చి వుండవచ్చు. పుంఖాను పుంఖాలుగా, దస్తాలకి దస్తాలు ఉల్లేఖించినవన్నీ నేను మెచ్చి వుండవచ్చు!
"బిన్ గురు జ్ఞాన్ కహాఁసే పావూఁ" ఇది విన్నప్పుడల్లా మనసు ఒక అలజడికి లోనవుతుంది. మనకు అలా దారి చూపే గురువు లెవరూ లేరే అని. "హమ్ నే నహీ హోగా.. కిసీ ఏక్ సె నిభానా" అని గుర్తొస్తుంది, నవ్వూ వస్తుంది. కాని,.........