తెలుగు సాహిత్యం-గుణాత్మక విమర్శలో మానవ సంబంధాల అభివృద్ధి
సాహిత్యమర్మాన్ని విశదీకరించిచెప్పేది 'విమర్శ'. ఇది రచయిత యొక్క రచనాంశాలకు పాఠక మనోచైతన్యానికి వారధి వంటిది. చారిత్రకంగా నన్నయాదుల కావ్యావతారికలలో ప్రాణం పోసుకున్నది విమర్శ. సాహిత్య ప్రయోజనాన్ని శబ్దార్థ జ్ఞానసౌందర్యాన్ని గురించి నన్నయ చెబితే, ఆధునిక కాలంలో కట్టమంచి రామలింగారెడ్డి ఆలోచనలో అది కావ్యతత్త్వానుశీలన రూపాన్ని పొందింది. అంతే కాదు సామాజిక ప్రయోజనదిశగా కూడ సాగింది. అత్యాధునిక కాలంలో సాహిత్య విమర్శ మానవసంబంధాల అభివృద్ధి కారకంగా కొనసాగుతోంది. సాహిత్య సమీక్షకులు రచయిత దృక్పథాన్ని వారివారి దృష్టితో చూడటంతో ఆత్మాశ్రయంగా ఉండే అవకాశముంది. కాని విస్తృతార్థంగల విమర్శ అనేది సృజనకు ప్రోద్బలకమైన నాటి సామాజికాంశాలను విశ్లేషణకు పెడుతుంది. అంతేకాదు, నేటి మానవ సంబంధాలలో అవి ఏవర్గంవారి ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయో సాపేక్ష ప్రమాణాలతో నిర్ధారించగలుగుతుంది. ఇతిహాసపు చీకటికోణాల అట్టడుగున దాగిన సత్యాన్ని వెలికితీసి ఒక దర్శనాన్ని ఇవ్వగలుగుతుంది. అందుకే కావ్యాంతర్గత తత్త్వాన్ని పరిశీలించే సహృదయ ప్రవృత్తి విమర్శకులకు ఉండాలి. రచయితకు ఉన్న సామాజిక దృక్పథపు ప్రయోగంలోని సాహిత్యాంశానికి విమర్శ వినూత్న సాహిత్య దర్శనాన్ని అందిస్తుంది. అప్పుడే విమర్శ పాఠకునిలో పఠనాసక్తిని, భావనాశక్తిని పెంచి..............