• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Sai Twameva Sharanam Mama

Sai Twameva Sharanam Mama By Dr Meenakshi Chintapalli

₹ 400

నేను పుట్టినప్పటి నుంచి కాలేజీ దాకా వివరాలు
 

శ్రీనివాసుని అనుగ్రహం, జీవితానికి భక్తి అనే పునాది ఎలా మొదలయింది

అన్న వివరణ. (1951-1975)

అర్థార్థిభక్తి

ఈ పేజీలలో అర్ధార్ధినై భగవంతుని ఉనికిని అనుభవ పూర్వకముగా తెలుసుకున్నాను. ఈ అనుభవాలలో, భగవంతుడు వున్నాడన్న సత్యం, కోరికలు తీర్చే వేల్పు, మన అహంకారం వదిలి, భగవంతుని మీద అన్నీ వేస్తే మన అవసరాలు ఆయనే చూస్తారన్న నమ్మకమునకు పునాది. భగవంతుడు లేడు, రామాయణ, భాగవతాలు నీతి బోధలు మాత్రమే అని అనుకున్న నాకు ఒక మార్పు.

భగవంతుడు మన అనుబంధాల్ని, కర్మలని, చూడని కంఠమాలని వేసి మనలని కలుపుతాడు. అదృష్టవశాత్తు, నా పూర్వజన్మ సత్కర్మ వలన, విశ్వకీర్తి పొందిన భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తిగారికి, శ్యామలాంబ గారికీ ప్రథమ సంతానంగా పుట్టాను. అప్పటికి మా నాన్నగారికి 22 ఏళ్ళు మాత్రమే, అమ్మకి 18 ఏళ్ళు మాత్రమే. చాలా సన్నగా, తీగలా వుండే ఆమెకి సాయంగా ఒక 12 ఏళ్ళ కుర్రవాడిని నన్ను చూసుకోవటానికి పెట్టారుట. నాకు 9 నెలల వయసులో నన్ను వాడు సముద్రపు ఒడ్డుకి తీసుకువెళ్లి, సిగరెట్తో కాల్చి, ఏడుస్తూ వున్న నన్ను విశాఖపట్నం సముద్రపు ఒడ్డున పడేసి పారిపోయాడుట. నేను సముద్రపు అలల నుంచి వచ్చిన నీళ్లు తాగానుట. శివుని లేనిదే చీమయినా కుట్టదు అంటారు. పరమ శివభక్తుడైన సంస్కృత ప్రొఫెసర్ షాడంగిగారు సంధ్యావందనానికి వచ్చి, నన్ను చూసి, గుర్తు పట్టి,................

  • Title :Sai Twameva Sharanam Mama
  • Author :Dr Meenakshi Chintapalli
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6213
  • Binding :Papar Back
  • Published Date :March, 2025
  • Number Of Pages :388
  • Language :Telugu
  • Availability :instock