నేపాల్ రాజధాని ఖట్మండూలోని హోటల్ రాడిసన్ అది. ఫోర్ స్టార్ హోటల్.
పూర్తిగా తెల్లవారకుండానే సూట్ నంబర్ 505 లో ఇంటర్ కామ్ మ్రోగింది.
గాఢనిద్రలో ఉన్న ఆ యువతికి ఫోన్ శబ్దానికి మెలకువ వచ్చేసింది. బెడ్ పక్కనున్న టీపాయ్ మీదున్న టెలెఫోన్ రిసీవర్ని అందుకుని, "హలో!" అంది
* "గుడ్మార్నింగ్, మేడమ్! దిసీజ్ రిసెప్షన్," విష్ చేస్తూ అంది హోటల్ రెసెప్షనిస్ట్.
“గుడ్మార్నింగ్!” నిద్రమత్తుతో గొణిగింది ఆ యువతి.
"సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ, మేడమ్!" అపాలజెటిక్గా అంది రిసెప్షనిస్ట్. "దేరీజ్ ఎ కాల్ ఫర్ యూ.
"హూ ఈజ్ దట్ ?”
"పేరు వనమాలి అట, మేడమ్! షల్ ఐ కనెక్ట్ ద కాల్?" పొలైట్గా అడిగింది రిసెప్షనిస్ట్.
"ఓ.కె.”
ఓ సెకను తరువాత, “హలో, మిస్ శాన్వీ!” అన్న మగ గొంతుక వినిపించింది. ఫోన్లో.................