పరిచయం
నా పదోయేటనుంచే సేల్స్ అమ్మకంలో ఉంటున్నాను. ఆ సమ్మర్ YMCA క్యాంపుకు వెళ్ళడానికి అవసరమైన డబ్బును నాకు నేనుగా సంపాదించు కోవాలని రోసమెల్ బ్యూటీసోప్ అమ్మడంతో అది ఆరంభమయింది. అప్పటి నుంచి పుస్తకాలు చదువుతూ, అధ్యయనం చేస్తూ సెల్లింగ్ అమ్మకం గురించి మరింత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎందుకంటే - అందులో విజయవంతంగా ఉండాలని మీలాగే ఆశించాను గనక.
నా కెరియర్ తొలిదశలోనే, “కొంతమంది సేల్స్ పీపుల్ మాత్రమే ఎందుకు ఇతరులకన్నా ఎంతో విజయవంతంగా ఉంటున్నారు?” అని ప్రశ్నించడం ప్రారంభించాను.
స్సే పుల్ ఎందరో అనుకున్నది సాధించలేక, పనితీరు సరిగా లేక సతమతమవుతూ ఉండగా, ఏ కొందరు స్సేపుల్ మాత్రమే ఎందుకు ఎక్కువ డబ్బును త్వరత్వరగా సంపాయిస్తూ, ఎక్కువ అమ్మకాలు చేయగలుగు తున్నారు? ఆ కొంతమందే ఎందుకు పెద్ద పెద్ద భవనాలు, కార్లు, ఖరీదయిన దుస్తులు అంటూ ఆస్తులు సంపాయించుకుంటూ, మరింత విజయాన్ని సాధించి మరెంతో తృప్తినీ, సంతోషాన్నీ అనుభవించగలుగుతున్నారు?
మొదటి సిద్ధాంతం
ఆ తరవాత నేను ప్యారెటో ప్రిన్సిపుల్ అనబడే 80/20 సూత్రాన్ని అనుగొన్నాను. 80 శాతం అమ్మకాలను 20 శాతం స్పేపుల్ చేస్తారని..........