• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sam Dhaatri

Sam Dhaatri By Jyothivalaboju

₹ 150

సరళ సుందరమైన కథలు

కథ, కవిత్వం, నవల...

ఇవన్నీ ఒకే సాహిత్య సృజనాత్మక తెగకు చెందిన భిన్న ప్రక్రియలు. అన్నీ హృదయసంబంధియై, ఒకానొక నైరూప్యమైన అజ్ఞాత ప్రస్పందనలతో సంలీన పరుస్తూ చదువుతున్నంతసేపూ ఒక్కోసారి రెండు హృదయాలనూ.. అప్పుడప్పుడు బహుళమై అనేకానేక శకలాలుగా ఛిద్రమై వియుక్తమైన విగత హృదయాలనూ కలిపి కుడుతూ... జోడిస్తూ... నది రెండు తీరాలను సంధానపరుస్తూ రెండు ఒకే శరీరానికి చెందిన చేతులను మరో రెండు చేతులై సంలీనపరుస్తున్నట్టు... అక్షరాలు అనుభూతులు, అనుభూతులుగా లేత దోసిట్లో పిచ్చుక పిల్లల్లా హృద్యంగా కదులుతూ, మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. మనుషులను పసిపిల్లలుగా, ముదురు మనుషులుగా, కఠినులుగా.. ఊర్కెనే స్రవించే కన్నీళ్ళుగా, ప్రవహించే ఒట్టి గాలి తరగలా. విస్ఫోటిస్తున్న మేఘ మల్హర్ రాగాలుగా... ఒక్కోసారి ఒట్టి ఏక్ తార సుదూర ధ్వనిగా, ఒక సారంగీ విషాద జీరగా... పల్లవిస్తూ, పరిఢవిస్తూ, చివరికి ఒక పిడికెడు మానవబంధమై వికసిస్తుంది. అప్పుడు మనుషులందరూ కథకులే, కవులే, నవలాకారులే ఔతారు తత్వరీత్యా... బయటికి వ్యక్తీకరించగలిగేవాళ్ళు కొందరైతే, నిశ్శబ్దంగా అనుభూతులనూ, అనుభవాలనూ నెమరువేసుకుంటూ గాత్రానికి అనుబంధ శృతిగా అనూచాన ధ్వనై మిగిలిపోయేవాళ్ళు మరికొందరు. ఐతే.. ప్రతి మనిషి ఏదో విధంగా తనను తాను ఎదుటి మనిషితో పంచుకోవాలనీ, తానూ ఒక వ్యక్తీకరణై సంధానించబడాలనీ తపిస్తూ తపిస్తూ... ఆ తీవ్ర తపనలో, నిగ్రాహాతీత దశలో కాగితంపై వర్షిస్తాడు లేక వర్షిస్తుంది. ఇక్కడ లింగభేదం లేదు. వివశతకూ నిస్సహాయ లొంగుబాట్లకూ..............

  • Title :Sam Dhaatri
  • Author :Jyothivalaboju
  • Publisher :Vanguri Foundation of America
  • ISBN :MANIMN5136
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :141
  • Language :Telugu
  • Availability :instock