• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Samachara Hakku Chattam

Samachara Hakku Chattam By Pendyala Satyanarayana

₹ 180

అధ్యాయం -1 ప్రాథమిక అంశములు

(Preliminary) 'సెక్షన్ 1 : సంక్షిప్త నామము, పరిధి, అమలులోకి వచ్చు తేది : 1. ఈ చట్టము యొక్క వ్యవహార నామము 'సమాచార హక్కు చట్టము, 2005'. 2 యావత్ భారతదేశానికి ఈ చట్టం వర్తిస్తుంది.

సెక్షన్ (4) లోని సబ్ సెక్షన్ (1), సెక్షన్ (5) లోని సబ్ సెక్షన్ (2), మరియు 12,13,15,16,24,27,28 సెక్షన్లు తక్షణమే అమలులోకి వస్తాయి. మిగిలిన సెక్షన్లు, ఈ చట్టము అమలులోకి వచ్చిన తేదీ నుండి 120వ రోజు నుండి అమలులోకి వస్తాయి. (15-6-2005 న ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. 21-6-2005 తేదీగల రాజపత్రంలో ముద్రించబడి, అప్పటినుండి అమలులోకి వచ్చింది) సెక్షన్ 2 : నిర్వచనాలు : సందర్భానుసారంగా ప్రత్యేక అర్థం ధ్వనించని యెడల, సాధారణంగా ఈచట్ట పరిధిలో కొన్ని పదాలకు అర్ధం, నిర్వచనం ఈ క్రింది విధంగా ఉంటుంది. ఎ) సంబంధిత ప్రభుత్వము : @ కేంద్ర ప్రభుత్వ, లేక కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వానికి చెందిన, లేక ఏర్పాటు చేయబడిన, లేక నియంత్రించబడే, లేక భారీగా నిధులు (ప్రత్యక్షంగా, లేక పరోక్షంగా) పొందే ప్రభుత్వ సంస్థలకు (పబ్లిక్ అధారిటి) సంబంధించి కేంద్ర ప్రభుత్వం అని అర్ధము. (ii) ప్రభుత్వానికి చెందిన, లేక ఏర్పాటు చేయబడిన, లేక నియంత్రించబడే లేక భారీగా నిధులు (ప్రత్యక్షంగా లేక పరోక్షంగా) పొందే ప్రభుత్వ సంస్థలకు (పబ్లిక్ అధారిటీ) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అని అర్ధము. బి) కేంద్ర సమాచార కమిషన్' అనగా సెక్షన్ 12లోని సబ్ సెక్షన్ (1) క్రింద ఏర్పాటు చేయబడిన కేంద్ర సమాచార కమిషన్. సి) కేంద్ర పౌర సమాచార అధికారి' అనగా సెక్షన్ (5)లోని సబ్ సెక్షన్ (1) క్రింద నియమించబడిన కేంద్ర పౌర సమాచార అధికారి. అదే సెక్షన్లోని సబ్ సెక్షన్ (2) క్రింది నియమించబడిన కేంద్ర సహాయక పౌర సమాచార అధికారికి కూడా ఈ నిర్వచనం వర్తిస్తుంది.....

  • Title :Samachara Hakku Chattam
  • Author :Pendyala Satyanarayana
  • Publisher :Supreme Law House
  • ISBN :MANIMN3449
  • Binding :Paerback
  • Published Date :July, 2022
  • Number Of Pages :112
  • Language :Telugu
  • Availability :instock