• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Samagra Vyayama Vidya

Samagra Vyayama Vidya By Dr K Raja Simha Ph D

₹ 1200

వ్యాయామ విద్య సూత్రాలు

(Principles of Physical Education)

వ్యాయామ విద్య

వ్యాయామం ద్వారా విద్యాభివృద్ధికి దోహదం చేయు విద్యను వ్యాయామ విద్య అందురు. సూత్రము అనగా "నిత్యసత్యము, న్యాయము, ధర్మము, ప్రవర్తనా నియమాలు” అని రూబెన్ ఫ్రాస్ట్ నిర్వచించెను.

వ్యాయామవిద్యా సూత్రాలు

అనాటమి, ఫిజియాలజి, కిన్సియాలజీ, సైకాలజీ, పాథాలజీ, ఫిలాసఫీ, ఆంత్రోపాలసీ (మానవ పరిణామ శాస్త్రము) మెదలైన వాటి నుండి గ్రహింపబడినవి.

సూత్ర లక్షణాలు

సూత్ర లక్షణమేమనగా శాశ్వత శాస్త్రోక్తమైన సూత్రాల సారాంశము, పరిశోధన తర్వాతనే తెలియును. వృత్తికి సూత్రాలు మార్గదర్శకాలు. ఇవి వ్యక్తి నిర్ణయాలకు చర్యలకు సహాయపడతాయి. వృత్తికి సంబంధించిన విషయాలను వ్యక్తులను బట్టికాక, వృత్తులను బట్టి నిర్ణయించడంలో సూత్రాలు ప్రాధాన్యత వహిస్తాయి.

వ్యాయామవిద్యకు సంబంధించిన ముఖ్య సూత్రాలు)

వ్యాయామ విద్యా లక్ష్యాలు స్పష్టముగా ఉండాలి. 2. వ్యాయామ విద్యా కార్యక్రమాలు విద్యార్థుల జీవన అవసరాలకు, అభివృద్ధికి అవసరాలకు తగినట్లుగా ఉండాలి. 3. విద్యార్థుల వెన్నముకపై ఎక్కువ ఒత్తిడి పడనీయకుండా చూడాలి. 4. వ్యాయామవిద్యా కార్యక్రమాలు బాలబాలికలకు వేరుగా ఉండాలి. 5. క్రీడలు నైతిక విలువలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. 6. క్రీడల్లో పాల్గొనే ముందు ప్రతి వ్యక్తికి వైద్య పరీక్ష చేయించాలి.

సూత్ర స్వభావం, విధులు

సూత్రము 'నిజము' అనే పదాన్ని సూచిస్తుంది. ఇది శాస్త్రీయ సత్యంపై ఆధారపడి వుంటుంది. వృత్తి విద్యను బోదించుటకు సూత్రము అవసరం. సూత్రం మన లక్ష్యాన్ని చేరుటకు దారి చూపును. వ్యాయామ విద్యలో అవసరమైన క్రియలను అనుకున్న పద్దతిలో బోధించి మంచి ఫలితాలను సాధించడానికి సూత్రాల పరిజ్ఞానం అవసరం..............

  • Title :Samagra Vyayama Vidya
  • Author :Dr K Raja Simha Ph D
  • Publisher :Dr K Raja Simha Ph D
  • ISBN :MANIMN5075
  • Binding :Papar Back
  • Published Date :Feb, 2023 2nd print
  • Number Of Pages :1016
  • Language :Telugu
  • Availability :instock