• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Samarasheela Dheera Vanita Kamalaa Harris

Samarasheela Dheera Vanita Kamalaa Harris By Acharya Yarlagadda Lakshmi Prasad

₹ 100

పోరాడి ఓడిన కమలా హారిస్

కమల అనేది స్వచ్ఛమైన భారతీయ పేరు. ఎందరో దక్షిణాది అమ్మాయిలకు కమల అనే పేరు ఉంటుంది. కమల లక్ష్మీదేవికి పర్యాయపదం. కమలంపై లక్ష్మీదేవి ఆసీనురాలై కనపడతారు. హిందువులు, బౌద్ధులు కమల పుష్పాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. కమలం కాండం బురదలో ఉన్నా పైకి స్వచ్ఛంగా, వికసిస్తూ అందంగా ఉంటుంది. ఇంతటి అందమైన పేరు ఉన్న భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్, ఒక మహిళ అమెరికాలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అమెరికా ఉపాధ్యక్షురాలవుతారని, అమెరికా అధ్యక్ష పదవికి కూడా పోటీ పడతారని ఎవరైనా ఊహించారా?

గత నవంబర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కమలా హారీస్ విజయం సాధిస్తే కోట్లాది మంది భారతీయులు సంబరాలు చేసుకునేవారు. కాని ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లలో ఆమెకు 226 ఓట్లు మాత్రమే దక్కాయి. 310 ఓట్లు సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించారు.

కమలా హారిస్ ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయి. 2024 జూన్ వరకూ జో బైడెన్ ఒక్కరే రంగంలో ఉన్నారు. ఆయననే డెమాక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంచుకుంది. జూన్లో డోనాల్డ్ ట్రంప్తో జరిగిన డిబేట్లో బైడెన్ పూర్తిగా తన వాదనను వినిపించడంలో విఫలమయ్యారు. వృద్ధాప్యం ఆయన ఉత్సాహాన్ని మింగివేసింది. తడబడడం, విషయాలను మరిచిపోవడం జనం దృష్టికి వచ్చింది. ఆ సమయంలో తప్పని పరిస్థితుల్లో పార్టీ కమలా హారిస్ను రంగంలోకి దించింది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లే సమర్థించడంతో కమలా.......................

  • Title :Samarasheela Dheera Vanita Kamalaa Harris
  • Author :Acharya Yarlagadda Lakshmi Prasad
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6030
  • Binding :Paerback
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :104
  • Language :Telugu
  • Availability :instock