రేవతి “ఒక హిజ్రా ఆత్మకథ”
రాజ్యాంగ నైతికతా పాఠం
డా॥ కల్పన కన్నబిరాన్
నైతిక చట్రంగా రాజ్యాంగం
"ట్రాన్స్ జండర్ కమ్యూనిటీ సభ్యులు గురయ్యే యాతన, వేదన, బాధలను సమాజం చాలా అరుదుగా గుర్తిస్తుంది, గుర్తించాలనే శ్రద్ధ కూడా చూపించదు. ముఖ్యంగా ఎవరి శారీరక లైంగికతను వారి మనసూ, శరీరం కూడా తమవి కావని తిరస్కరిస్తాయో వారి లోలోపలి అనుభూతులను సమాజం హర్షించదు. ట్రాన్స్లండర్ కమ్యూనిటీని మన సమాజం అవహేళన చేస్తుంది. నిందిస్తుంది. తిడుతుంది. రైల్వేస్టేషన్లు, బస్టాండులు, పాఠశాలలు, పనిచేసే ప్రదేశాలు, పెద్ద దుకాణాలు, సినిమాహాళ్ళు, ఆసుపత్రులు మొదలైన బహిరంగ ప్రదేశాలలో వాళ్ళను పక్కకు నెట్టేస్తారు. అంటరాని వాళ్ళుగా చూస్తారు. సమాజం భిన్న అస్తిత్వాలను, వ్యక్తీకరణలను ఆమోదించి అక్కున చేర్చుకోదు. మనం మార్చాల్సిన ఆ ఆలోచనా ధోరణి తన నైతిక ఓటమి అనే వాస్తవాన్ని సమాజం మర్చిపోతుంది".
(సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇన్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, రిట్ పిటిషన్ (సివిల్) నం. 604 ఆఫ్ 2013, పేరా 1)
సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుకి మూడు సంవత్సరాల ముందు నాజ్ ఫౌండేషన్ తీర్పులో ఢిల్లీ హైకోర్టు రాజ్యాంగానికి ఒక కొత్త వ్యాఖ్యానాన్ని ఆవిష్కరించింది. సెక్సువల్ మైనారిటీల (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జండర్ మరియు క్వీర్ వ్యక్తులు) హక్కులు ఇప్పుడు వివక్ష, అణచివేత, సాంఘిక వెలి, స్వేచ్చా నిరాకరణ......................