పరిచయం
ఒక ఎగ్జిక్యూటివ్ గా మీ వృత్తిలో మీ సమయ యాజమాన్య సామర్థ్యమే మీ విజయాన్ని లేదా అపజయాన్ని నిర్ణయిస్తుంది. ఒక విషయాన్ని సాధించడానికి సమయం తప్పించరాని, మరో ప్రత్యామ్నాయం లేని వనరు. అది మీ అమూల్యమైన ఆస్తి. దాన్ని ఆదా చేయడమో, ఒకసారి చేజారినట్టయితే తిరిగి రాబట్టుకోవడమో సాధ్యం కాదు. మీరు చేయ వలసిన ప్రతి పనికి సమయం కావాలి. మీరు సమయాన్ని మెరుగ్గా ఉపయోగించే కొద్దీ మీరు మరింత ఎక్కువ సాధించగలుగుతారు. ఫలితాలు మెరుగ్గానూ, మరింత గొప్పగానూ ఉంటాయి.
చక్కని ఆరోగ్యానికీ, శక్తివంతమైన వ్యక్తిత్వానికి సమయ యాజమాన్యం అత్యంత అవసరం. మీ జీవితం మీద, సమయం మీద మీకున్న నియంత్రణా శక్తిస్థాయి భావన - మీ అంతరంగిక శాంతి, సమన్వయం, మానసిక ఆరోగ్యం స్థాయిని ప్రధానంగా నిర్ణయిస్తుంది. మీ సమయం మీద మీకు నియంత్రణ లకపోతోందన్న మీ భావమే మీ ఒత్తిడికీ, ఆందోళనకూ, కుంగుబాటుకూ ప్రధాన వనరు. మీ జీవితంలోని క్రిటికల్ ఈవెంట్ను మెరుగ్గా ఆర్గనైజ్
కుంటూ నియంత్రించగలిగినట్టయితే క్షణం క్షణం మీరు మెరుగైన నిహంతో మరింత శక్తివంతంగా పనులు చేసుకుంటూ, మెరుగ్గా నిద్రపోగలుగుతూ మరింత ఎక్కువగా సాధించగలుగుతారు.
ఉపయోగించడం ద్వారా............