వాత'రీలీయం'
"ఊపిరి మనిషికి బ్రతికున్నాం అనే ఉనికినిస్తే, ప్రేమ మనం ఎలా జీవిస్తున్నామని చూపిస్తుంది. బ్రతకాలనుకుంటే శ్వాసించు, జీవించాలి అనుకుంటే ప్రేమించు.. ఇట్లు మీ ప్రేమమయి ప్రేమ్ అలియాస్ ప్రేమ్ కుమార్" సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేసి,
"ఈ రీల్ కూడా హిట్" అంటూ ఫోన్ పక్కన పెట్టాడు ప్రేమ్.
"నువ్వూ, నీ దిక్కుమాలిన మాటలూ.. ఎలా జీవిస్తున్నాం అని ప్రేమ చూపిస్తుందా, అర్ధం పర్ధం లేని మాటలు" అంటున్న తల్లి మాటలకి మధ్యలోనే అద్దిస్తూ,
"అమ్మా..! ప్రపంచంలో ఉన్న నా ఫాలోవర్స్ అందరూ మెచ్చుకుంటున్నారు, ఒక్క.. నువ్వు తప్పా" చిరాకుగా అన్నాడు ప్రేమ్.
"నేల జారిన నూనె తలకి పూసుకునే వెధవలు.. వాళ్ళకేమైనా తెలిసేడిస్తే కదా, నిన్ననడానికీ.. ప్రేమమయి అని నువ్వన్నపుడే, అది స్త్రీ సంబోధనరా సన్నాసి వెధవా.....................