₹ 80
నవయుగమున నరజాతికి సన్మార్గమును, సేవా కార్యక్రమముల రూపమున క్రమశిక్షణమును మాస్టర్ ఇ.కె. బోధించిరి. నిస్వార్ధ బుద్ధితో, విశ్వప్రేమతో నడచి కొన్ని వేలమందిని నడిపించిరి, ఆత్మజ్ఞానమును ప్రసాదించి అనుయాయులను కార్యోన్ముఖులుగా తయారుచేసిరి. మానవజాతి కళ్యాణార్థమై వేదవిద్య, యోగవిద్య లతోపాటు వైద్యవిద్యను కూడ పంచి పెట్టిరి. మాస్టర్ హోమియో వైద్యాలయములను, బాలభాను విద్యాలయములను నెలకొల్పిరి. శాశ్వతజ్ఞానమును వ్యాపింపచేయుటకు అనేక గ్రంథములను రచియించిరి. సామూహిక సహజీవనములో గల మాధుర్యము ననుభవింపచేయుటకు 1962లో తమ గురుదేవులైన “మాస్టర్ సి.వి.వి." పేర గురుపూజా ఉత్సవములను ప్రారంభించిరి. 1972లో “నావాణి", దర్శన మాసపత్రికను స్థాపించిరి. ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయమును సాధించుటకై “ది వరల్డ్ టీచర్ ట్రస్ట్” (జగద్గురు పీఠము)ను 1971 లో స్థాపించిరి. ఏడు పర్యాయములు పశ్చిమ ఖండములలో ఆధ్యాత్మిక ఉద్దీపనయాత్ర చేసిరి. అంతర్యామి స్వరూపులై వేలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వము ననుగ్రహించు చున్నారు.
- Title :sambashanalu samanvayalu
- Author :Kulapathi Ekkirala Krishnamacharya
- Publisher :Kulapathi Books Trust
- ISBN :MANIMN2624
- Binding :Paerback
- Published Date :Dec-2016
- Number Of Pages :168
- Language :Telugu
- Availability :instock