సంహిత
వాజ్పాయి, కాశీలో తెలుగువారికి యిష్టమైన గైడ్ కాశీకి చెందినవాడైనా అన్ని భాషల్లోని ఆయువు పట్లు తెలిసినవాడవటం చేత ఏ ప్రాంతం నుంచి వచ్చిన యాత్రికులనైనా క్షణంలో అతని మాటలతో వశపర్చుకోగలడు. మణికర్నిక ఘాట్ దగ్గర యాత్రికులకు కాశీక్షేత్రాన్ని గురించి చెప్తూ ఆలోచింప చేస్తున్నాడు. తెలుగు యాత్రికులను గైడ్ చేయటం సులువైన విద్య! అందుకే - 'దేవుడిని ఎక్కడైనా కోరికలతో ముంచెత్తుతారు భక్తులు! ఇక్కడ మాత్రం నాకు మృత్యువును ప్రసాదించమని ఒకే ఒక్క కోరికతో వస్తారు - ఈ విచిత్రం విశ్వనాధుడికీ - ఆ భక్తుడికీ తప్ప ఎవరికీ అంతుపట్టదు! ఆ కోరికలోనే అర్థం- పరమార్థం వుందని' జీవితం చదివినవారు భావిస్తారు!
'కాశీలాంటి క్షేత్రం నిప్పు, నీళ్ళూ కలయిక మణికర్నికలో మునక, విశ్వేశ్వరుడి సేవ అదేగా అంతిమంగా జీవన సోపానం' - పద్యంగా పాడిన వాజ్పాయి అంతటితో ఆగలేదు. ఆ తెలుగు యాత్రికులను ఆశ్చర్యంలో ముంచే విధంగా తన అంబుల పొదిలోంచి మరో బాణాన్ని తీసాడు.
"ప్రతి గ్రామంలో మాదిరే కాశీలోగూడా గ్రామ దేవత లాంటి దేవతను పూజిస్తారు. 'వారణాసి' దేవిగా త్రిలోచన గుడిలో ఆమెను కొలుస్తారు. నిజానికి మొత్తం కాశీ అంతా దేవతా స్వరూపిణిగానే భావించాలి! శివుని 'శక్తి'గా భాసిల్లుతుంది కాబట్టి!"................