• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Samkshipta Mudgala Puranam

Samkshipta Mudgala Puranam By Acharya Kolluru Avatara Sharma

₹ 150

అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు పరమపూజ్య

శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి ఆశీస్సందేశము

||గం గణపతయేనమః ॥

"గణపతి" అనగానే మా ఒడలు పులకించిపోతుంది. ఎందుకంటే ఆయన మా ఈ అవతారంలో అడుగడుగునా ఉన్నాడు. మా పేరులో కూడా కొలువై ఉన్నాడు. అటువంటి గణపతి స్వామి చరిత్రను తెలిపే ఈ ముద్గలపురాణాన్ని మేము సుమారు 70వ దశకంలో విజయవాటికలోని “క్షిప్రగణపతి” సన్నిధిలో ప్రవచించామన్న గుర్తు.

మళ్లీ ఇప్పుడు శర్మగారు రచించిన ఆ ముద్గలపురాణంలోని వక్రతుండచరిత్రను చూస్తుంటే, గణపతి స్వామితో ముడిపడి ఉన్న దత్తస్వామి గుర్తుకు వస్తున్నాడు. దత్తస్వామి శివాది దేవతల ప్రార్థన మేరకు “హృదిస్థం మత్సరం హత్వా పశ్చాత్తం జహి దానవమ్” (వక్రతుండచరిత్రము) ముందుగా మీ హృదయాలలో “నా అంతటివాడు లేడు. నేనే గొప్పవాడిని" ఉన్న మాత్సర్యాన్ని చంపుకోండి. తరువాత అతడు, ఆ మత్సరుడు సులభంగా తొలగిపోతాడు. ఇదంతా జరగటానికి మీరు “ఏకాక్షర గణపతిని” ధ్యానించండి - అనే ఉపాయాన్ని చెప్పాడు.

ఇలా దత్తస్వామి వక్రతుండుడి చరిత్రలో ప్రతినాయకుడైన మత్సరుడి లొంగుబాటుకు ప్రధానకారణమై ఉన్నాడు. ఇటువంటి ఈ చరిత్రలో ఇంకా లోకానికి ఉపకరించే ఎన్నో రహస్యాలున్నాయి. అలాగే స్వామి లీలలను తెలిపే కథలెన్నో ఉన్నాయి. తత్త్వమెంతో ఉంది. కనుక ఈ వక్రతుండుడి చరిత్రను అందుకొని అందరూ పారాయణ చెయ్యండి. గణపతిదేవుడు మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తాడు.

శర్మగారు త్వరలోనే ఈ ముద్గల పురాణాన్ని పూర్తి చేసి లోకానికి మేలు చేసెదరు గాక! గణపతి మరియు దత్తదేవులిద్దరి కృపాకటాక్షాలు శర్మగారిపై పరిపూర్ణంగా ప్రసరించుగాక! - అని ఆశీర్వదిస్తూ.................

  • Title :Samkshipta Mudgala Puranam
  • Author :Acharya Kolluru Avatara Sharma
  • Publisher :Rambhatla Surekharamarao
  • ISBN :MANIMN6138
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :189
  • Language :Telugu
  • Availability :instock