ధనవంతులయ్యేందుకు ఓ శాస్త్రం ఉంది.
ధనవంతులు కావడానికి ఓ శాస్త్రం ఉంది. అది.. బీజ గణితం లేదా అంకగణితం వంటి కచ్చితమైన శాస్త్రం. సంపదను సంపాదించే ప్రక్రియను నియంత్రించే కొన్ని చట్టాలున్నాయి. ఈ చట్టాలను నేర్చుకుని, పాలించిన తర్వాత ఎవరైనా నిశ్చయంగా సంపన్నుడు కాగలడు. ఒక నిర్దిష్ట మార్గంలో పనిచేయడం వలన డబ్బు మరియు ఆస్తి యాజమాన్యం లభిస్తుంది. ఉద్దేశపూర్వకంగా గానీ లేదంటే అనుకోకుండా కానీ ఈ నిర్దిష్ట మార్గంలో పనిచేసిన వారు సంపన్నులు అవుతారు. ఈ నిర్దిష్ట మార్గంలో పనులు చేయనివారు ఎంత కష్టపడినా, ఎంత సామర్థ్యం ఉన్నా 'పేదలుగానే మిగిలిపోతారు. ఇది నిజమని ఈ క్రింది విషయాలు నిర్ధారిస్తాయి.
ధనవంతులు కావడమనేది పర్యావరణానికి సంబంధించిన అంశం కాదు. ఒకవేళ అదే గనుక నిజమైతే నిరిష పరిసరాలలోని వారంతా సంపన్నులు అవుతారు. ఒక పట్టణంలోని వారో లేదంటే ఒక రాష్ట్రంలోని వారో మాత్రమే ధనవంతులుగా ఉంటారు. ఇతర పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లోని వారంతా పేదలుగానే మిగిలిపోతారు. కానీ.. ప్రతిచోటా ధనవంతులు, పేదలు పక్కపక్కనే ఒకే వాతావరణంలో నివసిస్తుంటారు. వారిలో చాలామంది ఒకే వృత్తిలో కొనసాగడం కూడా మనం చూసే ఉంటాం. ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రాంతంలో, ఒకే వ్యాపారంలో ఉన్నప్పుడు వారిలో ఒకరు ధనవంతులుగా మరొకరు పేదలుగా ఉన్నప్పుడు.. సంపన్నులు కావడమనేది ప్రధానంగా పర్యావరణానికి సంబంధించిన అంశం కాదన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది.
కొన్ని వాతావరణాలు ఇతరులకన్నా మరింత ఎక్కువ అనుకూలంగా ఉండొచ్చు. | ... ఒకే వ్యాపారంలో ఉన్న ఇదరు వ్యక్తులు ఒకే పరిసరాల్లో ఉన్నప్పుడు వారిలో - విఫలమై.. మరొకరు ధనవంతులు కావడం అనేది ఒక నిర్దిష్ట మార్గంలో ........