పురాణాలు పూర్వజన్మకృత
దివ్యాభరణాలు
వ్యాసునిచే వివరించబడి విఘ్నేశ్వరునిచే వ్రాయబడిన 18 పురాణాలలో విష్ణుపురాణం పరాశరునిచే చెప్పబడినదయితే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతునికి చెప్పిన “మానవ మోక్ష పధ దీపిక" గరుడ పురాణము. అవసరానికి అద్దెకు తెచ్చుకొనేది కాదు, యింటిలో ఏమూలో వుండేది అంతకంటే కానేకాదు. ఒంటినిండా అంటిపెట్టకుమండు నిత్యధారణా వస్త్రము వంటిదే గరుడ పురాణము. నరనరాల జీర్ణించుకోవలసిన శ్రీమహావిష్ణువుని జ్ఞానోపదేశములు.
హిందూమతంలో జన్మించిన మానవునికి కొన్ని సంస్కారములు మరికొందరికి షోడశ సంస్కారాలు వుంటాయి. అందు 15 కర్మలు మాతృ గర్భంనుండి మరుభూమి చేరేవరకు, ఆ 16వదే అంతిమ సంస్కారం. 16వ కర్మకు జరిపేవన్నీ “పూర్వం" అని, 15 కర్మల తర్వాత 16వ సంస్కారకర్మను "అపరం” అని, వాటినే అపరకర్మలు అంటారు. ఇహమందు చేసిన సుకృతదుష్కృత కర్మలకు అంతిమ సంస్కారములుగా మరణానంతరము ప్రాయశ్చిత్త పరంగాచేసే, అశౌచ కర్మ కాండలను "అపర క్రియ"గా
చెబుతారు.
మరణానంతరం పొందే యీ స్థూల సూక్ష్మ కారణ దేహాలజీవి ఆరాటపోరాటాలు, ప్రేతాత్మలు పొందే యాతనా శరీర అవస్థలూ, జీవాత్మలు ప్రేతాత్మలైనాక భవితవ్య వివరణలు తెలుపు పురాణం "శ్రీ గరుడ పురాణం".
దురదృష్టమేమంటే, విగతజీవుల విషాద సమయంలో మాత్రమే గరుడ పురాణం చదవాలనుకొంటే, మైలపడినపుడు మాత్రమే స్నానంగా మిగతా రోజులలో నీటితో పనేంటి? అనుకొన్న చందాన వుంటుంది. అలాగే భగవద్గీతను చనిపోయినప్పుడు మాత్రమే పాటలుగా పెట్టడం, వినడం, వరకే పరిమితి చేయడం విచారించవలసిన విషయం. మనిషి జీవించినపుడు.................