• Email: support@logilitelugubooks.com
 • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sampurna Sri Parasara Samhita

Sampurna Sri Parasara Samhita By Brahmasri Mangipudi Suryanarayana

₹ 450

ఆంజనేయ అవతార విశేషములు

మైత్రేయ ఉవాచ: ఓ బ్రాహ్మణోత్తమా! హనుమంతుని యవతారములు గురించి, ఆ అవతారములకు గల పేర్లు, ఏ ఏ అవతారములను ఉపాశిస్తే బక్తులకు అత్యంత మేలు జరుగుతుంది. మొదలగు విషయముల గురించి క్షుణ్ణంగా తెలుప వలసినదని మైత్రేయులవారు, పరాశర మహామునిని అడిగెను మైత్రేయులు వారు అడిగిన సందేహములకు పరాశరులవారు చెప్పడం ప్రారంభించారు.

ఓ మైత్రేయా! హనుమంతునకు గుణములు, అవతారాలు, పేర్లు చాలాకలవు. తత్త్వరూపమున హనుమంతుడు బ్రహ్మాండము నంతటివాడు. హనుమంతుని అవతారములు అనేకములు వున్నా పూజచేయుటకు అనువైనవి 9 మాత్రమే వున్నవి. అవి

 1. ప్రసన్నాంజనేయ రూపము
 2. వీరాంజనేయ రూపము
 3. ఇరువదిభుజములు కల రూపము
 4. పంచముఖాంజనేయము
 5. పదునెనిమిది భుజములు కల్గిన రూపము
 6. సువర్చలాతిరూపము
 7. నాల్గుచేతులు కల రూపము
 8. ముప్పదిరెండు చేతులు కల రూపము
 9. తొమ్మిదవది వానరాకారము

తొమ్మిది రూపములు కల్గిన హనుమంతుడు సేవింపబడుచున్నాడు. పూర్వ గాధలు:

పూర్వము చతుర్ముఖ బ్రహ్మ ఇరువది చేతులు కల హనుమంతుని పూజించి ప్రజాపతియయ్యెను.

కపిలుడు అను బ్రాహ్మణ వేదపండితుడు నాల్గుభుజములు కల హనుమంతుని ఉపాసించి ఇహపర సాధకుడయ్యెను. మహాశూరుడు, క్షత్రియుడు, లోకపాలకుడు అయిన విజయుడు ప్రసన్నాంజనేయుని ధ్యానించి సంసారసాగరమును దాటెను....................

 • Title :Sampurna Sri Parasara Samhita
 • Author :Brahmasri Mangipudi Suryanarayana
 • Publisher :Mohan Publications
 • ISBN :MANIMN4802
 • Binding :Papar back
 • Published Date :2023
 • Number Of Pages :460
 • Language :Telugu
 • Availability :instock