• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Samsaravruksham

Samsaravruksham By R R Sudarshanam

₹ 170

"అన్నమైతే నేమిరా మరి సున్నమైతే నేమిరా

అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా"

ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలవేళ. పడుకుంటే నిద్ర రాలేదు. చదువుకో బుద్ధయ్యలేదు. బయటనుంచి పిల్లలగోల, ఉన్నట్లుండి పాట మొదలెట్టారు వాళ్ళు చప్పట్లు చరుస్తూ.

ఆ పాట ఈమధ్య ఎప్పుడూ వినలేదు. ఈ పిల్లలు ఎక్కడ పట్టుకున్నారో! కుతూహలంగా వరండాలోనికి వచ్చాను. రావిచెట్టు క్రింద విశ్వం, గోపి, రాధ కనిపించారు. విశ్వం ఏడవ తరగతి చదువుతున్నాడు. మిగతా యిద్దరు చిన్నపిల్లలు. విశ్వాన్ని పిలిచాను. వచ్చాడు.

             "ఏక్కడిదోయ్ ఈపాట?" అన్నాను వరండాలో కుర్చీలో కూర్చుంటూ.

             "మా టీచర్ నిన్న క్లాసులో చెప్పాడు"

             "ఇలా పాడుతూ మిమ్మల్ని పాడమని చెప్పాడు?"

              "రంతిదేవుని పాఠం చెబుతూ దొంగ సన్యాసున్ని గూర్చి ఈపాట చెప్పాడు."

                 "C"

           "రంతి దేవుని కథలాంటివి పట్టి నాన్సెన్స్. తను పస్తుండి యితర్లకు పెట్టడం గొప్పతనంగా చెప్పే మాటలు వట్టి దొంగ కబుర్లట. మనం తిని యితర్లకు కూడా పెట్టడం. సోషలిజం. ఇతర్లకి లేకుండా మనం తినెయ్యడం కాపిటలిజం అని కూడా చెప్పాడు... ఇంకా ఏమిటేమిటో చెప్పాడు."

"... కాని బోధపడలేదు! పంతులెవరో గట్టివాడే!"

"దొంగ సన్యాసులు, లోకం మాయ, అన్నమైనా ఒకటే సున్నమైనా ఒకటే. బంగారైనా ఒకటే, మట్టి అయినా ఒక్కటే అంటూ వస్తారుట. కాని వాళ్ళ చూపంతా మంచి పళ్లూ ఫలహారాలమీదా, బంగారం డబ్బూ కొట్టెయ్యడం మీదా ఉంటుంది. వాళ్ళంటే జాగ్రత్తగా..............

  • Title :Samsaravruksham
  • Author :R R Sudarshanam
  • Publisher :Rata Konda Prachuranalu
  • ISBN :MANIMN4127
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :105
  • Language :Telugu
  • Availability :instock