సంస్కృత
కుమార వ్యాకరణము
వర్ణములు - వాటి లక్షణములు
చేతనములైన భూతము లన్నియు, తమ తమ సుఖదుఃఇది భావములను వ్యక్తము చేయుటకును తమ మనోగతాభిప్రాయములను ఇతర ప్రాణులకు తెలుపుటకును, నోటితో, ఏదో ఒక విధమైన ధ్వనిని చేయును. పాములు బుస కొట్టుట, పక్షులు కిలకిల లాడుట, పశువులు ఆధారనము చేయుట, శిశువులు ఏడ్చుట, నవ్వుట మొదలైన ధ్వను లన్నియు నోరు లేని యా ప్రాణులు తమ వేదనలను, అభిప్రాయములను వ్యక్త పరచుటకు చేయు శబ్దములు. అవన్నియు అవ్యక్త ధ్వనులు. అట్టిధ్వనులే వ్యక్త రూపములో, మానపుడు తన భావములను ప్రకా శము చేయుటకు ఉపయోగించునపుడు ఆశబ్దము భాష అని పిలువబడును. కాబట్టి మానవుడు తన భావ ప్రకాశనార్థము ఉపయోగించెడి శబ్దము నకే భాష అని పేరు.
ప్రపంచములో ఎన్నో జాతులున్నవి. ఆ జాతులన్నింటికి తగిన ఎన్నో భాషలున్నవి. వాటిలో అతి ప్రాచీనమై, సుసంపన్నమై, నాగ రికమై, ప్రాచీన భారతీయార్యులచే మాటలాడబడిన భాషకు సంస్కృతమని పేరు.
ఆభాషలో పుట్టిన వాఙ్మయమునంతను వాక్యములుగా, పదము ఆుగా, వర్ణములుగా వ్యాకరించి చూచిన మేధావులు ఆభాషలో పద ............