• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Samskruti Bhasha Charitra

Samskruti Bhasha Charitra By Velcheru Narayana Rao

₹ 300

భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం - 1
 

వెల్చేరు నారాయణరావు
డేవిడ్ షుల్మన్
సంజయ్ సుబ్రహ్మణ్యం

  1. చరిత్ర లక్షణం

వలసపాలనకి పూర్వం- అంటే పద్దెనిమిదో శతాబ్దం ముందు కాలంలో దక్షిణ భారత ప్రాంతంలో చరిత్ర, చారిత్రక చైతన్యమూ అంటూ అసలుండేవా? గతం గురించి ఎంతోకొంత తెలిసే ఉండి వుండాలి కదా ఏదో ఒక రూపంలో. అయినప్పటికీ, తరతరాలుగా ఎందరో చరిత్రకారులు, మానవవిజ్ఞాన శాస్త్రజ్ఞులు, భాషాతత్వవేత్తలు దక్షిణ భారతీయులకి వాస్తవికమైన చరిత్రపట్ల శతాబ్దాలుగా నిర్లక్ష్య వైఖరి ఉండేదనే భావించారు. బహుశా గతం గురించీ, విధి గురించీ, లేదా గతానికీ, వర్తమానానికీ ఉన్న సంబంధాల గురించీ ప్రత్యేకమైన అభిప్రాయాలున్న ఈ సంస్కృతి తన చరిత్రను వేరేరకంగా రాసుకున్నదేమో. గ్రీకులకు థుసిడైడిస్ (Thucydides), హెరోడాటస్ (Herodotus), పర్షియన్లకు అల్ తబారీ (Al-tabari), చైనీయులకు సుమా చియెన్ (Sima Qian) వున్నట్లు మనకంటూ చరిత్రకారులు ఎవరూ లేరు. సుమారు వెయ్యేళ్ల క్రితమే అల్ బీరూనీ (Abu al-Biruni) వంటి పండితుడే, “దురదృష్టవశాత్తు భారతీయులు చారిత్రక గతిక్రమాన్ని పట్టించుకోరు. వారి రాజుల వంశపరంపరలు నమోదు చేసుకోవడంలో వారికి ఒకరకమైన నిర్లక్ష్య భావం ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక...............

  • Title :Samskruti Bhasha Charitra
  • Author :Velcheru Narayana Rao
  • Publisher :Tana Prachuranalu
  • ISBN :MANIMN5114
  • Binding :Papar back
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :310
  • Language :Telugu
  • Availability :instock