సస్వరూప కథలకి... రెండు కళ్లని జోడించినప్పుడు...!!
శిధిల జాగారాలు... ఊపిరి ముట్టడిపై అంటి పెట్టుకుని రాలే నిశ్చల కదలికపై అనాయాస సవారీలు, కథాముద్రలో పక్షపాత దర్శనాలు. స్వయం చాలన లేని ఆలోచనల తీరుపై ప్రవహించే దుఃఖనేరాల చీకటి.
ఇలా మాత్రమే ఉందని జరిగిందని... జరుగుతుందని... చెప్పినా కొన్ని ఒప్పుకోలేనివి. కొన్ని నిస్పృహ కలిగించేవి... కొన్ని ఒంటిపై కొరడాలు ఝుళిపించేవి.
ఆశ్రిత మాడు సాయాలకి దూరంగా జరిగే... నిందల గట్టు తీర్మానాలు... దృష్టి మూలాలు... కదలికలు... అకస్మాత్తుగా ఏదో తేల్చుకోలేం... తేలిగ్గా తీసుకోలేం... తొందరపడి ఏదో ఒకటి అనేయలేం. ఎందుకంటే ఈ కథల్లో కొన్ని పెనుగర్భ శోఖాలు.... శ్రీనివాసులు రెడ్డి గారి కథల్ని మొదటిసారి చదివినప్పుడు నాకు అప్పటికప్పుడు కలిగిన అభిప్రాయం.
ఆ తరువాత ఒక్కో కథను నా లోపల పర్చుకుంటూ... కళ్ళను దానిపై ప్రవహించ -దానికి వదిలినప్పుడు మరింత బాధించడం... మళ్ళీ ప్రశ్నించడం మొదలైంది.
ఆదమర్చి మళ్ళీ తెచ్చిపోగేసుకొన్న నిర్మాణ గందర గోళాలన్న ఇప్పుడు ఆక్షేపించ బడుతున్న ఒకప్పుడు స్పష్టంగా ఇచ్చిన భరోసాలే... నమ్మకాలే... పూజనీయత... విలువలు ... గౌరవాలని మనం నెత్తిన ఊరేగించినవే... మహా రక్షలవి.
ఆధునికాంతరత మనిషిని మనిషినుంచి దూరం చేసుకుంటూ పోతున్న ఈ ఒంటరితనం లోనుంచి కథలు కేవలం జ్ఞాపకాలేనా... ఒకానొకప్పుడని మొదలవ్వాల్సిందేనా?.....................