• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sangamam Sandeshatmaka Navala

Sangamam Sandeshatmaka Navala By Jannabhatla Narasimha Prasad

₹ 200

సంగమం

అది ఒక పల్లెటూరు. దాదాపు రెండువందల కుటుంబాలు ఉన్నాయి. అప్పుడప్పుడే ఆ ఊరికి పట్నం పోకడలు సంతరించుకుంటున్నాయి. కొత్తగా హైస్కూల్, ఆరోగ్య కేంద్రం, పోస్టాఫీసులు నెలకొల్పారు.

చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి చాలా మంది రైతులు కూలీలు ఆ ఊరు వచ్చి స్థిరపడ్డారు. ఆ చుట్టుప్రక్కల కనీసం నాలుగు కోసుల దూరంలో ఎక్కడా హైస్కూల్ లేదు. అందుకని ఇతర గ్రామాల విద్యార్థులు అందరూ అక్కడకే వచ్చి ఆ ఊరు పాఠశాలలో చదువుతున్నారు.

నారాయణరావు గారు ఆ హైస్కూల్లో ఇంగ్లీషు మాస్టార్గా పనిచేస్తున్నారు. తన వద్ద చదువుకుంటున్న విద్యార్థులకు మంచి మార్కులు రావాలి అనే ఉద్దేశ్యంతో ఇంగ్లీషు పాఠాలు అర్థంకాని విద్యార్థులకు తన ఇంట్లో ప్రత్యేక క్లాసులు తీసుకొని బోధించేవారు.

దీనికోసం ఎటువంటి ప్రతిఫలం విద్యార్థుల నుంచి వసూలు చేసేవారు కాదు. విద్యార్థుల తల్లిదండ్రులు గురువు గారికి నగదు రూపేణ కాకుండ పాలు, పెరుగు పోసి తమ సహకారాన్ని అందించేవారు.

హై స్కూల్లో పదవతరగతి చదివే పిల్లలలో ముగ్గురు విద్యార్థినులు ఉన్నారు. వారి పేర్లు సరోజ, ఆదిలక్ష్మి, స్వరాజ్యం. ముగ్గురూ తెలివిగల వారే. క్లాసులో అందరికంటే మంచి మార్కులు తెచ్చుకొనేవారు.

ఇంగ్లీష్ ఉపవాచకంలో ఉన్న రోమియో జూలియట్ అనే పాఠ్యాంశం వారిని బాగా ఆకట్టుకొన్నది. ప్రేమ ఎంత గొప్పదో అనీ అజరామరమైనది, పవిత్రమైనదనీ భావనా లోకంలో విహరించే వారు. తాము అలా ప్రియులతో ప్రేమించబడి పెళ్ళిచేసుకొని తమ పేర్లు తమ ఊరిలోని అందరూ ఎంతో గొప్పగా చెప్పుకోవాలి అని కలలు కనేవారు.

ఆరోజుల్లో తల్లిదండ్రులు అందరూ బడిలో చదువు చెప్పే ఉపాధ్యాయులకు ఎంతో గౌరవము, మన్నన ఇచ్చేవారు. తమ పిల్లలను................................

  • Title :Sangamam Sandeshatmaka Navala
  • Author :Jannabhatla Narasimha Prasad
  • Publisher :Jannabhatla Narasimha Prasad
  • ISBN :MANIMN4403
  • Binding :Papar back
  • Published Date :June, 2022
  • Number Of Pages :74
  • Language :Telugu
  • Availability :instock