• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sangeeta Saraswathi Lata Mangeshkar

Sangeeta Saraswathi Lata Mangeshkar By Kasturi Murali Krishna

₹ 300

నాంది

తూ జహా జహా చలేగా

మేర సాయ సాథ్ హోగా!

మన నీడ కూడా మనల్ని వదలి పోవచ్చేమోగానీ లతా మంగేష్కర్ పాట మాత్రం మనల్ని వదలి పోదు. భౌతికంగా లతా మంగేష్కర్ అనే శరీరం వడలిపోయి, మనల్ని వదలి పోయి ఉండవచ్చుగానీ, సరస్వతి వీణాస్వరం లాంటి లతా మంగేష్కర్ సరసస్వర సురఝరీ తరంగాలు, తరతరాలుగా అత్యుత్తమ గాన సంవిధానానికి తార్కాణంగా నిలచి ఉంటాయి. సంగీతానికి స్పందించే లక్షణం మానవ సమాజంలో, మనిషి హృదయంలో సజీవంగా వున్నంతకాలం తరాలను స్పందింప చేస్తూనే ఉంటాయి.

లతా మంగేష్కర్ స్వతహాగా అల్లరి పిల్ల. కానీ బాల్యం సవ్యంగా అనుభవించే కన్నా ముందే ఇంటి బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవల్సి వచ్చింది. తనతో పాటు ఇంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకోవాల్సిన చెల్లి తన జీవితాన్ని తాను చూసుకుని ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదలి వెళ్లిపోయింది. అయినా లత బెదరలేదు. తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగింది. 'నేను' 'నా జీవితం' 'నా ఆనందాలు' అని ఆధునిక అభివృద్ధి చెందిన 4 మహిళల్లా ఆలోచించి, కుటుంబాన్ని తన దారిన తాను వదలి తన జీవితం చూసుకోలేదు. పోరాడింది. అదీ ఎలా? తన ప్రతిభనే ఆయుధంలా! తన సత్ప్రవర్తనే కవచంలా! తన నిజాయితీ, వినయాలతో ప్రపంచాన్ని గెలిచింది. ఎంత ఎదిగితే అంత ఒదిగింది. కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకు వచ్చింది. జీవితాన్ని 'పాట'కే అంకితం చేసి, ఒంటరిగా నిలిచింది. 'మహిళ' అంటే విలువలేని, చులకన అభిప్రాయం కల సినీ పరిశ్రమలో ఎవరూ తాకలేని 'హిమాలయ శిఖరం'లా ఉన్నతంగా నిలిచింది. కన్నెత్తి చూడలేని స్వచ్ఛమయిన సూర్యకిరణంలా తళతళ లాడింది. దేశ ప్రజల దృష్టిలో స్వచ్ఛమయిన అంకితభావానికి, భక్తికి, నిస్వార్థానికి, నిజాయితీకి ప్రతీకలా నిలచి భారతరత్నగా ఎదిగింది. అలాంటి అత్యుత్తమ వ్యక్తి అంతరంగాన్ని ఆమె జీవితం ద్వారా, ఆమె పాటల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం ఇది.

లతా మంగేష్కర్ ఎక్కువగా ఎవరితో మాట్లాడేది కాదు. ఇంటర్వ్యూలు ఇచ్చేది కాదు. వాద వివాదాలకు దూరంగా ఉండేది. ఎవరైనా ఆమెపై ఆరోపణలు చేసినా,.................

  • Title :Sangeeta Saraswathi Lata Mangeshkar
  • Author :Kasturi Murali Krishna
  • Publisher :Sahiti Prachuranalu
  • ISBN :MANIMN4341
  • Binding :papar back
  • Published Date :April, 2023
  • Number Of Pages :424
  • Language :Telugu
  • Availability :instock