• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sangeeta Vidya

Sangeeta Vidya By Sadguru Dr K Sivanandamurty

₹ 300

మొదటి సమావేశము - 28-4-2002
 

ఆర్ష విద్య ప్రయోజకత్వము - పరిరక్షణ

 

భారతీయ సంస్కృతిలో మహర్షులకు ఒక పవిత్రమైన అత్యుత్తమైన స్థానము ఉన్నది. తపో మార్గములో సిద్ధి పొందిన ఆర్యుల ఆ మహర్షుల సంతానమే, భరద్వాజ, గౌతమ, వశిష్ఠాది మహర్షుల సంతానమే, మనమంతా! మనము మన తలిదండ్రుల, తాతల పేర్లును సాధారణముగా తెలుసుకుంటూ ఉంటాము. ఇది నిన్న మొన్నటి కథ. అసలు కథ ఏమిటంటే, ఎవరైనా మనమంతా ఎవరము అని అడిగితే ఫలానా వారి పిల్లలము అని చెప్పకుండా మనమంతా మహర్షుల సంతానము అని చెప్పుకోవాలి. అది మన ధర్మము. వారే మనకు మార్గ దర్శకులు. మార్గాన్ని చూపించిన వారు. అయితే, తరువాత తరువాత మనము క్రమమ్రంగా దూరమైపోయి, రెండు వేల తరాలు గడిచి పోయినవి. అయినా మనలో ఈ సంస్కృతిలో ఇంకా వారి తేజస్సు మన అంతఃకరణలలో వెలుగుతూనే ఉన్నది.

మహర్షుల ప్రసాదించిన గాయత్రి మహా మంత్రాన్ని ఇంకా ఈనాటికి కూడా మనము నిత్యము జపిస్తూనే ఉన్నాము. వారు మనకు ప్రసాదించారు అంటే మన మీద దయతోటే వారు ఆ పని చేసారు. వారు ఈశ్వరుని "శ్రీ మహా విష్ణు! మా తరతరాలు పిల్లలు నిన్ను ఎన్నడూ మరచిపోకుండా ఉందురుగాక! వారికి నీవు మార్గాన్ని చూపించుదువు గాక! మేము కర్తలము కాము. సమర్థులము కాము, మా భవిష్యత్సంతానాన్ని నీ పరము చేస్తున్నాము. వారిని రక్షిస్తూ, కాపాడుతూ, నీ మార్గములో పెట్టుకో!" అని ప్రార్థించారు. భగవంతునికి వారు తాము చేసిన తపస్సును నీటితో ధారపోసారు. వారు చేసిన తపస్సుకు, ప్రార్ధనకు, ఫలముగా భగవంతుడు మనకు సంస్కారాన్ని ఇచ్చాడు.

ఈశ్వర ప్రసాదితమైన ఈ సంస్కారము అందరిలోనూ యోగరూపము లోనో, తపోరూపములోనో లేదు. వెయ్యి రకాల రూపాలతో వెయ్యి విభూతులతో, అందరి....................

  • Title :Sangeeta Vidya
  • Author :Sadguru Dr K Sivanandamurty
  • Publisher :Sivananda Supadha Foundation
  • ISBN :MANIMN5619
  • Binding :Papar Back
  • Published Date :June, 2023
  • Number Of Pages :352
  • Language :Telugu
  • Availability :instock