ఆలోచనలు
లోబ్సాంగ్ రంపా వ్రాసిన 'చాప్టర్స్ ఆఫ్ లైఫ్' అనే దాంట్లో మీకు ఆ ప్రస్తావన దొరుకుతుంది. ఆ కాగితాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి రోజు ఐన్స్టీన్కి ఒక పెద్ద టెన్షన్ ఈ రీసెర్చి చెయ్యొద్దు, ఇంకా మానవజాతికి ఈ రీసెర్చిని తట్టుకునే శక్తి లేదు అనే ఈ కాగితాలు ఎవరు పెడుతున్నారు అని. కాని హిట్లర్ అతడిని ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఏమవుతుందో అనుకుని చేశాడు. తర్వాత మీకు తెలిసిందే కదా. ఆ దెబ్బ నుండి జపాను ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పటికి కూడా అంగవైకల్యాల వీ కొనసాగుతూ ఉన్నాయి. కానీ బాంబు పడిన తర్వాత ఐన్స్టీన్ రియాక్షన్ మీకు తెలియదు. ఆ రోజు నుంచి ఆయన ఒకే మాట అనేవాడు. పాపం చేశాను. నేను పాపం చేశాను అదే అతని భజన. 1955లో చనిపోయాడు. ఆ దెబ్బ, ఆ షాక్ ఆయన తట్టుకోలేకపోయాడు. మహాత్ములు చెప్పారు చెయ్యకురా బాబు అటామిక్ ఎనర్జీని తట్టుకోలేరు ఎంచేతంటే ధియో యోనః ప్రచోదయాత్ సన్మార్గం వైపు దీనిని ఉపయోగించాలన్న భావం రాలేదు. అంచేత అణు శక్తి (అటామిక్ ఎనర్జీ) యే ఇంత ప్రమాదకరమైనదైతే ఇంక సోలార్ ఎనర్జీ ఎంత ప్రమాదకరమైనది అవుతుందో మీరు ఇంకా ఊహించలేరు. అటామిక్ ఎనర్జీకంటే ఎక్కువ శక్తివంతమైనది అది. అటామిక్ ఎనర్జీ రహస్యాలు మీ వరకు రావాలంటే ఈ నిబంధన ఉండాలి. "ధియో యోనః ప్రచోదయాత్” ఆ సూర్యుడి యొక్క కిరణాలను నేను ధారణ చేస్తున్నాను నా బుద్ధి సన్మార్గం వైపు వెళ్ళుగాక. ఇదే సైంటిఫిక్ రీసెర్కి భావం. ఇది కనిపెడతాను, ఇది కనిపెడతాను అని మీరు అంటూ ఉండండి అది కనిపెట్టేస్తారు. సైన్స్ జరిగేది అదే కనక నా యొక్క మేధస్సు, నా యొక్క బుద్ధి సూర్యకిరణాలను ధారణ చేస్తుంది. తత్సవితుర్వరేణ్యం. ఈ ధారణ చేస్తున్న నా బుద్ధి మళ్ళా భ్రష్టత పడితే చాలా కష్టం..................