• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sankalpa Balam

Sankalpa Balam By Dr Pardhasaradhi Chiruvolu

₹ 399

పరిచయం

మీరు విజయాన్ని ఎలాగయినా నిర్వచించండి. సంతోషంగా ఉండే కుటుంబం, మంచి స్నేహితులు, సంతృప్తికరమైన జీవనోపాధి, దృఢమైన ఆరోగ్యం, ఆర్థిక భద్రత, మన ఆశయాలను నెరవేర్చుకునే స్వేచ్ఛ.. ఇలా ఏదయినా సరే, అందులో రెండు లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి. 'సానుకూల ఫలితాలు' అందుకోవటానికి అవసరమైన వ్యక్తిత్వలక్షణాలను వేరు చేసి చూసినప్పుడు మనస్తత్వవేత్తలకు ఈ రెండు అంశాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. అవి తెలివితేటలు, స్వీయ నియంత్రణ. వ్యక్తిలో శాశ్వతంగా తెలివితేటలను పెంచటానికి ఏం చేయాలో శాస్త్రవేత్తలు ఇప్పటి వరకూ కనుగొనలేకపోయారు. కానీ స్వీయ నియంత్రణకు సంబంధించి వాళ్లు కొన్ని అంశాలను తెలుసుకోగలిగారు లేదా కనుగొనగలిగారు.

అందుకే ఈ పుస్తకం మీ ముందుకొచ్చింది. సంకల్పశక్తి, స్వీయనియంత్రణ విషయంలో శాస్త్రవేత్తలు సాగించిన పరిశోధనలు మానవ కల్యాణానికి దోహదం చేసేవిగా ఉన్నాయి. సంకల్పశక్తి వల్ల మనం మారతాం. అదే సమయంలో సమాజం కూడా కొద్దిగానో, ఎక్కువగానో మారుతుంది. " మనం మన ఆలోచలను నియంత్రించుకోవాలనే గుర్తించటమే మన నైతిక సంస్కృతిలో అత్యున్నత స్థితి” అన్నారు ఛార్లెస్ డార్విన్, ‘డిసెంట్ ఆఫ్ మ్యాన్' అన్న తన పుస్తకంలో. కానీ విక్టోరియా కాలం నాటి భావనలు వాటికి మద్దతు ప్రకటించలేదు. 20వ శతాబ్దపు మనస్తత్వవేత్తలు, తత్త్వవేత్తలు కొందరు అసలు అలాంటిది ఉంటుందా అన్న సందేహం వ్యక్తం చేశారు. ఈ పుస్తక రచయిత బౌమాయిస్టర్ కూడా తొలుత సంశయవాదిగా ఉన్నా ప్రయోగాల అనంతరం దాని ఉనికిని గుర్తించగలిగారు. వ్యక్తులు బాగా కష్టపడటానికి అవసరమైన సామర్థ్యాన్ని అది ఎలా అందిస్తుందో గుర్తించారు. సంకల్పశక్తి తగ్గిపోయినప్పుడు వాళ్లు స్వీయనియంత్రణను కోల్పోవటాన్ని పసిగట్టారు. రక్తంలో ఉన్న గ్లూకోజు మానసిక శక్తిని ఎలా పురిగొల్పుతుందో గ్రహించారు. ఆయన, ఆయన సహచరులు ఇంకో విషయం తెలుసుకున్నారు. సంకల్పశక్తి అనేది ఓ కండరంలా ఎక్కువగా ఉపయోగిస్తే అలిసిపోతుందని, వ్యాయామం ద్వారా దీర్ఘకాలం పనిచేయిస్తే.................

  • Title :Sankalpa Balam
  • Author :Dr Pardhasaradhi Chiruvolu
  • Publisher :Manjul Pablication House
  • ISBN :MANIMN6013
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :238
  • Language :Telugu
  • Availability :instock