₹ 350
వ్యక్తికేది కావలయునో జాతికి కూడా అదే కావలయును. అనగా తన కేది కావలయునో ఇతరులకు కూడా అదే కావలయునని యర్థము. దీనిని గుర్తించుటయే ధర్మమును గుర్తించుట. దీనిని గుర్తించునట్లు చేయు దివ్యవాక్కే 'శంఖారావము'. శరీరము అను రథములో నుండి యిది వినిపించును. ఈ శంఖారావమును విని, తానును పూరింప వలసినవాడు దేహములోని జీవుడు.
ఈ దేహమున ధర్మమనబడు శంఖారావము సారథి రూపుడైన నారాయణునిచే చేయబడును. ఆ రావము మనస్సు నుండి పంచేంద్రి యముల లోనికి దిగివచ్చి, పంచభూతాత్మకమైన శరీరమును నిర్వహించుచు, పంచతన్మాత్రల మూలమున జన్యమైన సమన్వయముగా వినబడవలెను. కనుక శ్రీకృష్ణుడు ఊదిన శంఖము పేరు 'పాంచజన్యము'. ఇక నరుడు పూరించు శంఖము తన స్వంతము కాదు. దేవునిచే దత్తము. కనుక అర్జును డూదిన శంఖము పేరు దేవదత్తము.
నారాయణుడు పూరించు శంఖారావము నరునకు (అనగా జీవునకు) ధర్మ బోధయై వినిపించును. ఈ బోధనే వ్యాసుడు 'భగవద్గీత' యని వ్యవహరించినాడు. 'గీత'యనగా గానము చేయబడినది. అది శ్లోక రూపము, సంగీత రూపము మాత్రమే గాక, జీవు డలవరచుకొన వలసిన గానము.
- మాస్టర్ ఇ.కె.
- Title :Sankharavam
- Author :Ekkirala Krishanamacharya
- Publisher :Kulapathi Books Trust
- ISBN :MANIMN2625
- Binding :Paerback
- Published Date :May-2012
- Number Of Pages :612
- Language :Telugu
- Availability :instock