పిల్లి గారి ఫిలాసఫీ
నాకిలాంటి దయనీయ పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. కళ్లు తేలిపోతున్నాయి. ఒళ్లు తూలిపోతూ ఉంది. నిలబడడానికి శక్తిలేదు. ఆలోచించడానికి ఓపికలేదు. మనసంతా గందరగోళంగా ఉంది. నిరంతరం మాంసాహారం తినే నేను, ఇప్పుడు దానివైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదు. జలపాతంలా పరవళ్లు తొక్కుతూ ఉరకలు వేసే నేను, ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఈసురోమంటున్నాను. జీవితాన్ని బంగారు కలలా ఊహించుకునే నేను, ఇప్పుడు జీవితం మిథ్య అనే వేదాంతంలోకి వచ్చాను.
ఎప్పుడు వచ్చింది ఈ మార్పు? అని ఒకసారి ఆలోచిస్తే, నా గురువు, దైవం లాయర్ రుద్రశేఖర్ గారి అమెరికా ప్రయాణమే నా ఈ స్థితికి కారణమని అర్ధమైంది............