• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Santhi Pondhadam Ela

Santhi Pondhadam Ela By J P Vaswani , Kesava Harinadha Reddy

₹ 250

ఉపోద్ఘాతము

దాదా జె.పి. వాస్వాని (1918)

జషాన్ పహజాయ్ వాస్వాని (భక్తులందరికి దాదా జషాన్) శ్రీ సాధు వాస్వానిగారి అన్న కుమారుడు జె.పి. వాస్వాని గారు సింధు ప్రాంతంలోని హైదరాబాద్లో ఆగస్ట్ 2వ తేదీన, 1918వ సం||లో జన్మించారు. ఈయన పహ్లజాయ్గారికి మొదటి కుమారుడు. పహ్లయ్గారు శ్రీసాధు వాస్వానిగారి కిష్టమైన అన్నయ్య. పహ్లజాయ్ గారప్పుడు హైదరాబాద్ టీచర్స్ (ఉపాధ్యాయులు) ట్రైనింగ్ కాలేజిలో పని చేస్తుండేవారు. క్రమేణ ఆయన మునిసిపాలిటీలోని స్కూళ్ళకు సూపర్వైజర్ అయ్యారు. ఆయనకు ఆంగ్లభాషలో రాయడం, మాట్లాడడం క్షుణ్ణంగా వచ్చేది. వాస్వానిగారి తల్లి కృష్ణాదేవికి కూడ కొంతమేర ఇంగ్లీష్ అర్థమయ్యేది. ఆమెకు మంచి జ్ఞానం, విశాల హృదయం ఉండేది. అందువల్ల ఆమె ధైర్యంగా కొన్ని సాంప్రదాయ కట్టుబాట్లనుండి బయటికొచ్చింది. సింధూ స్త్రీలు సామాన్యంగా పొడవైన స్కర్ట్లను ధరించేవారు. కాని తను వాటిని కాదని చీరలను ధరించడం ప్రారంభించింది. ముఖంపైని మేలిముసుగును కూడ ధరించడం మానివేసింది.

వాస్వానిగారు చిన్నప్పుడే గొప్ప మేధాశక్తిని కలిగి ఉండేవారు. అందువల్ల తన 5 సంవత్సరాల ప్రాథమిక విద్యను 3 సంవత్సరాలల్లోనే ముగించారు. ఆ కుటుంబం ఆర్థికంగా చాలా చిక్కుల్లో పడింది. అప్పుడాయన తన తల్లికి టీచర్ కమ్మని ధైర్యం చెప్పాడు. ఇది ఒక సాహసోపేతమైన చర్య. మొట్ట మొదటిగా ఉద్యోగాల్ని చేపట్టిన సింధూ స్త్రీలలో ఆమె కూడ ఒక్కతి. ఆమె తన ఐదుగురి సంతానాన్ని పోషించడానికి కష్టపడడంతో ఆమె తన పెద్ద కుమారుడైన జషన్ పైనే అన్ని ఆశలు పెట్టుకుంది. జషన్ అందుకు తగ్గట్టుగానే హైస్కూల్లోనూ, కాలేజిలోను తన ప్రతిభతో రాణించేవాడు.

తన పదమూడవ ఏట జషన్ గారు కరాచిలోని డి. జె. సింధ్ కాలేజిలో సైన్స్ డిగ్రీ కోర్స్లో చేరారు. యూనివర్సిటిలో మొదటి ర్యాంకు సాధించి ఒక కాలేజిలో "ఫెలో"గా చేరారు. అందువల్ల ఆ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరు ఆయన 'ఐసిఎస్'.................

  • Title :Santhi Pondhadam Ela
  • Author :J P Vaswani , Kesava Harinadha Reddy
  • Publisher :Alakananda Prachuranalu
  • ISBN :MANIMN4089
  • Binding :Papar back
  • Published Date :Jan, 2023
  • Number Of Pages :218
  • Language :Telugu
  • Availability :instock