• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sanyasini Adagandi

Sanyasini Adagandi By Nityanand Charan Das

₹ 299

పరిచయం

నిజాయితీపరులైన ఆరుగురు సహాయకులు నావెంట

(నాకు తెలిసినవన్నీ వారే బోధించారు)

ఏమిటి? ఎందుకు? ఎప్పుడు? ఎలా?

ఎక్కడ? ఎవరు? అన్నవే వారి పేర్లు!

- రుడ్యార్డ్ కిప్లింగ్
 

ప్రశ్నలు అడగడం తెలివికి గుర్తు. ప్రశ్నించడం మేథస్సుకు చిహ్నం. ప్రశ్నలు అడిగేశక్తి, మన వృత్తిజీవితాల్లోనూ, వ్యక్తిగత జీవితాల్లోనూ మన జీవితాల సకల పార్శ్యాలనూ ఎంతగానో ప్రభావితం చేస్తుంది. నిజానికి, ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే, మనం ఇంతవరకు నేర్చుకున్నది అంతా కూడా ప్రశ్నలు అడగడం ద్వారానే మనకు లభ్యమయిందని తెలియవస్తుంది.

మన బాల్యంలో, చుట్టూవున్న ప్రపంచంతో పరస్పర సంబంధాలలో, చర్యలలో ప్రశ్నలు, ఆసక్తి సహజ అంతర్భాగం. ఎల్లప్పుడూ పిల్లలు 'ఎందుకు' 'ఎలా' అనే ప్రశ్నలు పెద్దలు ఆశ్చర్యపడేలా అడుగుతూ ఉంటారు. పెరిగేకొద్దీ, కాలక్రమేణా మనలో ఆ ఆసక్తి తగ్గుముఖం పడుతుంది. పరీక్షలయినా, ఇంటర్వ్యూలైనా, సంభాషణలయినా మనం సమాధానాలు చెప్పడం మరింత ముఖ్యం అన్న భావాన్ని సమాజం మనలో కలిగిస్తుంది. పెద్దవాళ్ళయ్యాక అఖరికి ప్రశ్నలు అడగడం ఆపేసి అలవాటుగా చేసే పనుల్లో కూరుకుపోతాం.

పిల్లలు మాత్రం, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తమకు తృప్తి కలిగే వరకు పెద్దలు ఆశ్చర్యపడే విధంగా 'ఎందుకు' అని మాటిమాటికీ మనల్ని అడగడానికి ఏమాత్రం వెనుకాడరు...................

  • Title :Sanyasini Adagandi
  • Author :Nityanand Charan Das
  • Publisher :Manjul Publishing House
  • ISBN :MANIMN6387
  • Binding :Papar Back
  • Published Date :2022
  • Number Of Pages :233
  • Language :Telugu
  • Availability :instock