పూర్వఖండము
పరిభాషాధ్యాయము
శ్లో. శ్రియం దద్భవతం పురారిర్యదంగ తేజః ప్రసరే భవానీ,
విరాజతే నిర్మలచంద్రికాయాం మహౌషధీవ జ్వలితా హిమాద్రౌ.
తా. హిమవత్పర్వతమున స్వచ్ఛమగు పున్నమి వెన్నెలచే ఓషధులు ప్రకాశించు విధముగా ఎవ్వనిశరీరకాంతిచే హిమవంతుని ముద్దులపట్టి తేజరిల్లుచుండునో అట్టి పార్వతీసహితుడగు పరమేశ్వరుడు మీకు శుభం కలిగింతురు గాక.
ప్రసిద్ధయోగామునిభి:ప్రయుక్తాశ్చికిత్సకై ర్యేబహుశో 2నుభూతాః,
విధీయతే శారధరేణ తేషాం సుసంగ్రహస్సజ్జనరంజనాయ.
చరకసుశ్రుతాది ఋషులచే జెప్పబడి భిషగ్వరుల యనుభవంబున నున్న ప్రసిద్ధ యోగంబులను ఇక్కడ చెప్పుచున్నానని శార్ణధరాచార్యుడు చెప్పుచున్నాడు.
రోగోద్భవ పూర్వలక్షణము
హేత్వాదిరూపాకృతిసాత్మ్యజాతిభేదైస్సమిక్ష్యాతురసర్వరోగా,
చికిత్సితం కర్షణబృంహణాఖ్యం కుర్వీతవైద్యోవిధివత్సుయోగైః. 3
హేతువు, పూర్వరూపము, ఆకృతి, సాత్మ్యము, జాతి వీనిచే రోగ స్వరూపంబును చక్కగా తెలిసికొని దోషావస్థాభేదంబుచే కర్షణ, బృంహణ చికిత్సను చేయవలెను.
1.'హేతువు' అనగా రోగము పుట్టుటకు ముఖ్యకారణము. 2. 'పూర్వరూపము' అనగా రోగము జనించుటకు పూర్వము పుట్టు వెల వెలబాటు, ఒడలువిఱుపు, ఆవులింతలు, నేత్రస్రావము మొదలగునవి. 3. 'ఆకృతి' యనగా రోగము పుట్టినపిమ్మట ఆయా రోగమున పుట్టు లక్షణములు. 4. 'సాత్మ్యము' అనగా రోగజ్ఞానము సంపూర్ణముగా తెలియనపుడు ఆయాదోషనివృత్తికి సాధనములగు ఆహారాచారప్రయోగము. 5. 'జాతి' యన ప్రకుపితమగు దోషమునకు ఊర్ధ్వగతియు, అధోగతియు, తిర్యగతియు, వీనిచే గలిగెడి రోగములకు చికిత్సభేదమును తెలియజేయు ఉపాయము. అది సంప్రాప్తియని వ్యవహరింప బడును. అది సంఖ్యాదిభేదముల నానావిధలై యుండును. ఆయాభేదముల తంత్రాంతరమున జడగును. 6. 'కర్షణచికిత్స' యనగా తీక్షములగు ఓషధులచే శరీరమును కృశింపజేయుట, ఇది "అంతర్పణ" మనబడును. 7. 'బృంహణ చికిత్స' యనగా స్నిగ్ధములగు పదార్ధములచే కృశించిన శరీరమునకు పుష్టిని గలిగించుట. ఇది "సంతర్పణ" మనబడును.....................