సరోజ (నవల)
-
- జస్టిస్ బి. చంద్రకుమార్
సరోజది చక్కని ముఖవర్చస్సు. చాలా చురుకైన పిల్ల. తండ్రి జగన్నాథం హోటల్ పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి ఈశ్వరమ్మ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది. సరోజకు మోహన్ తమ్ముడు ఉన్నాడు. ఒక ఎకరం భూమి, ఇల్లు తప్ప వేరే ఆస్తుపాస్తులు ఏమీ లేవు. పొలం నుండి వచ్చే ధాన్యంతో ఆ కుటుంబానికి బియ్యం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. హోటల్ నుండి వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోతుంది. సరోజ హైస్కూల్ చదివేటప్పుడు ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీల్లో నాటకాలలో పాల్గొనేది. చక్కగా పాడుతుంది కూడా. 10వ తరగతి పాసైయ్యాక సరోజకి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు ఆలోచించారు. తనకి ఇంకా చదువుకోవాలని ఉన్నప్పటికి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సరోజకి మరో మార్గం లేకపోయింది. అదిగాక ఇంటర్లో చేరడానికి మరో పట్టణానికి పోవాల్సి ఉండేది.
వెంకటేష్ సరోజకి వరుసకి బావ అవుతాడు. మేనబావ కాకపోయిన సరోజతో సన్నిహితంగా ఉండేవాడు. ఎప్పుడైనా స్కూల్కి వెళ్లడానికి, రావడానికి బస్సు అందకపోయిన వెంకటేష్ సరోజని స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్ నుండి ఇంటికి....................