ధన్య కృషి
అన్నదానం చిదంబరశాస్త్రి
శ్రీమతి చొప్పల్లి లలితాశర్మ గారు తమ రచనల ద్వారా మహిళామతల్లులకు మహోపకారము చేస్తున్నారు. వారిచే సంకలనం గావించి, ముద్రితమయిన "షోడశ కర్మలకు” సంబంధించిన పుస్తకములలో "మాతృత్వ పరిణామక్రమము", సంప్రదాయా చారములకు మార్గదర్శకం కాగా ఈ “శ్రీ సర్వదేవతా కల్పోక్త పూజావిధానము” అందరకూ ఉపకరించేదే అయినప్పటికీ ముఖ్యంగా పైన చెప్పబడిన రెండు పుస్తకములు మహిళలకు అత్యవసరమయినవి. సదాచార సంపన్నురాలయిన రచయిత్రి స్త్రీలకు శాస్త్ర మిచ్చిన అవకాశపు పరిధిలోనే పూజావిధానమందించటం మెచ్చుకొనదగిన విషయం. సంవత్సరంలో ఏఏ నెలలలో ఏ పర్వములు ముఖ్యములో, ఆ సందర్భంలో ఏ దేవతను..............