సర్వదేవతా గోత్ర ప్రవరలు (ద్వితీయ భాగము)
పండిత అభిప్రాయము
మన భరత భూమి వేద భూమి, కర్మ భూమి, ఇట్టి మహిమాన్విత భూమి పై పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ధర్మ, అర్థ, కామ, మోక్షాది పురుషార్ధ సాధనకు శ్రేష్టమైన మానవ జన్మపోందడము సుకృతమే. జన్మ పరం పరం నుండి విముక్తి పోంది మోక్ష సాధన అనేది చతురాశ్రమ ధర్మా చరణము ద్వార మాత్రమే సుసద్యం అందు బ్రహ్మచర్య, వానప్రస్తం, సన్యాసం కంటే గృహస్తాశ్రమ ధర్మాచరణ ద్వారా మాత్రమే మోక్ష సాధన సులభం, కనుక సమాజంలో వివాహ సంస్కారము ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నది. నేటి నిర్విదాంశము మోక్షసాధనకు శృతి, స్మృతి, శ్రోత, స్మార్త కర్మాను ష్టానము ఉత్తమమార్గము నిత్యకర్మలచే చిత్తశుద్ధి, పితృ కర్మలచే పితృఋణ విముక్తి కలిగి జన్మపరం పరం నుండి మోక్షసాధన సులభతర మవుతుంది. అందుకే చతురాశ్రమ ధర్మాల్లోని వివాహవ్యవస్థ వేదమంత్రాలు, ప్రమాణాలు, దానాలు, ప్రాంతీయ ఆచారాలు కట్టు బాట్లు (వివాహవ్యవస్థలో పెండ్లిలో) ఇమిడి ఉంటాయి. అందుకే లోకకళ్యాణార్ధము అనేక దేవాలయాలలో, వీరిపందిర్లలలో నూతనగృహాలలో దేవతలుకు కూడా కళ్యాణం చేయడం పరంపరగా వస్తున్న ఆచారము దైవాను గ్రహం యజమానితో పాటు లోకంలోని సమస్త జనులకు దైవ కళ్యాణం వలన పరిస్కారింపబడుతుంది. అందుకే దేవాలయాలల్లో జరిగేదైవ కళ్యాణం సర్వజనులకు సకల శుభాలు మంగళప్రదమైన, సుఖమైన జీవితాన్ని కలుగ చేస్తాయని విశ్వసిస్తారు తిరుమలలో స్వామివారిక నిత్య కళ్యాణం భద్రాధి, శ్రీశైలం, వేములవాడ, విజయవాడ, ఒంటిమిట్ట, సింహాచలం, దేవాలయా లలో అధిష్ఠాన దేవతలకు, రాష్ట్రం, దేశం ప్రజలు మంచివర్షాలు కలిగి పంటలు బాగా పండి,...............