• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sarvartha Nakshatra Fala Muhurta Chintamani

Sarvartha Nakshatra Fala Muhurta Chintamani By K S Krishana Murty Garu , Sri Telu Sri Krishna Sidhanthi

₹ 450

కాలగ్రహాధిపతుల, గుణస్వభావ వివరణ ప్రకరణము

కాలస్వరూపుడు సూర్యుడు, కాలస్వరూపుణీ చంద్రుడు, కాలశక్తి సంపన్న స్వరూపుడు కుజుడు, కాల విద్యా వికాసుడు బుధుడు, కాల విజ్ఞా విధాత బృహస్పతి, కాలజీవనాధారుడు శుక్రుడు, కాలనాధక్షుడు శనైశ్చరుడు, కాల సర్పస్వరూపులు రాహు, కేతువులు, కాల విభాగములన్నియు గ్రహాధిష్ఠిములైయున్నవి. కావున కాల విభాగముల స్థితిననుసరించి యున్న స్వభావగుణ శీలములను మఱియు స్వభావములను బట్టియు. | ఆయా విభాగాధిపతి గ్రహము యొక్క స్వభావగుణ శీలములను బట్టియు ఆయా విభాగంలో తత్కాలమున నున్న గోచార సంచార గ్రహములను బట్టియు అనుగుణ లేదా ప్రతికూల ఫలములు కలుగుచుండును. రాశి, తిధి, నక్షత్ర వారాధిపతులు, లగ్నాధిపతి, కాల విభాగంలో జన్మకాలమున నున్న గ్రహముల స్థానస్థితులను బట్టి శుభాశుభ ఫలములను విచారించవలయును. ఈ అధ్యాయములో వివిధ కాల విభాగముల స్వభావ గుణశీలములు, వాటి కారకత్వ విషయములును గ్రహించబడును. | గ్రహములు తామున్న నక్షత్ర నాధుని స్థాన స్థితులను అనుసరించి ఫలితములిచ్చును. కావున గ్రహముల కాలస్వభావ గుణశీలములు, కారత్వాది సంబంధ విషయములు | క్షుణ్ణముగా పరిశీలించి శుభకార్య ముహూర్తమును నిర్ణయించినప్పుడు లగ్నము, | గ్రహస్థితులు, భావకారకత్వమును సంగ్రహముగా పరిశీలించాలి.

రాశి గ్రహస్వభావ గుణశీల వివరణ

కాలచక్రములో రాశి ప్రమాణములు మిక్కిలి ప్రాధాన్యత కలిగి ఉన్నావి. పండ్రెండు రాశులే లగ్న రాశులు, హోరా, ద్రేక్కాణ, నవాంశాది అంశరాశులు కూడా 3) అగుచున్నవి. కావున అన్ని రాశులు, అంశ విభాగములు ఒకే పరిమాణముగా ఉండి | వివిధ నామములు కలిగియున్నవి. ఆకార ఆధిపత్యము, గుణము, స్వభావము, కారకత్వ లక్షణములు విభిన్నముగా ఉంటాయి. మేష, వృషభ, మిధున, కర్కాటక, సింహ, ఆ కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనరాశులుగా విభిన్న చిహ్నాలు కలిగి ఉంటాయి. ఇందు కొన్ని క్రూరరాశులు, కొన్ని సౌమ్యరాశులు. కొన్ని స్థిరస్వభావము కలవి, కొన్ని చరస్వభావముకలవి, కొన్ని ద్విస్వభావ రాశుల తత్త్వము కలిగి ఉంటాయి...............