• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Sasirekha Chalam Sahityam Navalalu

Sasirekha Chalam Sahityam Navalalu By Chalam

₹ 180

శశిరేఖ

ఒకనాటి సాయంకాలము ఆరుగంటలప్పుడు పదునారేళ్ళ బాలిక యొకతె, కడవ చేతులో పట్టుకొని కాలవవైపు పోవుచుండెను. ఆ బాట దట్టముగ పెరిగిన మర్రి చెట్లచే పందిరితోవలె కప్పబడ్డది. భూదేవత దాల్చిన నూత్న వస్త్రములవలె రెండు వేపులను పెద్ద పచ్చిక బయళ్ళు. ముడిలో లొంగక ముఖముపై, మెడపై, చెవులపై, గుంపులుగ వేలాడు ఆ బాలిక జుట్టులో చిక్కుకుని ప్రకాశించుచున్నవి సూర్యకిరణములు, నల్లని ఆమె కన్నులలోపడి మార్పుచెంది, పెదవులనుండి చిరునవ్వు రూపమున ప్రతి ఫలించినదా అనునట్లు లేయెండ ఆమె మోమును ఆకుల సందులలో నుండి స్పృశించుచుండెను. యవ్వన జనితమగు సంతోషము ఆమె యవ యవముల నుండి నిగనిగలాడుచుండెను. కారణ రహితముగ పొడము ఆనందము ఆమె యిడు ప్రతి అడుగునుండియు, వ్యక్తమగుచున్నది. ముందు ఇతరులకిచ్చి తాననుభవింపగల ప్రేమ ఆమెయందు సృష్టిచే సేకరింపబడు........................

  • Title :Sasirekha Chalam Sahityam Navalalu
  • Author :Chalam
  • Publisher :Amaravti Publications
  • ISBN :MANIMN6104
  • Binding :Papar Back
  • Published Date :Jan, 2025
  • Number Of Pages :193
  • Language :Telugu
  • Availability :instock