• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Satyanveshi Chalam

Satyanveshi Chalam By Dr Vandrevu Veeralakshmi Devi

₹ 275

అన్వేషి - చలం

గుడిపాటి వెంకటాచలం 'చలం'గా సాహిత్యలోకంలో వ్యవహరించబడ్డాడు. 1894లో పుట్టి 1979 వరకూ ఎనభై అయిదు సంవత్సరాలు జీవించాడు.

తన సాహిత్యం ద్వారాను, సంఘవ్యతిరేక జీవనవిధానం ద్వారానూ ఆనాటి నుంచీ ఈనాటి వరకూ ప్రజలందరికీ, ముఖ్యంగా సాహిత్యాభిమానులకూ, విమర్శకులకూ, మేధావులకూ రకరకాలుగా అర్థం అవుతూ, విభేదించబడుతూ, ఆరాధించబడుతూ వచ్చాడు.

ఇన్ని రకాల విరుద్ధ భావాలను మేధావుల నుంచి సామాన్య ప్రజల వరకూ, కవులనుంచీ, భావుకులనుంచీ, సామాన్య పాఠకుల వరకూ కలిగించిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే అని చెప్పవచ్చు.

విమర్శకులు ఆయనను పలువిధాలుగా విమర్శించారు. సాహిత్యం ద్వారా, జీవనవిధానం ద్వారా ఆయనను నిర్ణయించి, ఆయన ఆలోచనలను వివరించడంలో ఇప్పటికీ ఎంతోమంది అనేక విరుద్ధాభిప్రాయాలనూ, విభిన్నాభిప్రాయాలను వెలి బుచ్చారు.

ఇక్కడ ఒక విషయం చెప్పవలసి ఉంది.

ఏ రచయితా తను నిర్మించిన లేదా సృష్టించిన సాహిత్యం కంటే ఆత్మలో భిన్నంగా ఉండడు. రచయిత తన ఆత్మ సంస్కార ప్రేరణ వల్లనే ఉత్తమ రచనలు చెయ్య గలుగుతాడు.

ఆత్మగతమయిన సంస్కారం ఇచ్చిన జ్ఞానం అతని రచనలో కన్పించినట్టు అతని జీవన విధానంలో కనిపించడం అన్నది సాధారణంగా జరగకపోవచ్చు. తన రచనలోని ఆదర్శాలను తన జీవితంలో నిలుపుకోవడం, ఆ విధంగా జీవితాన్ని మలచుకోవడం ఎంతో కష్టమయిన పని.

అలా చెయ్యగలగడానికి, ఆ రచయితకు తన పట్ల ఒక వైద్యుడికి రోగిపట్ల గల అవగాహన, విశ్లేషణ వంటివి కావాలి.................

  • Title :Satyanveshi Chalam
  • Author :Dr Vandrevu Veeralakshmi Devi
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN4483
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :261
  • Language :Telugu
  • Availability :instock