• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Savarla Konda

Savarla Konda By Karuna Kumar

₹ 200

స్త్రీరూప జగత్తు

--మహమ్మద్ ఖదీర్ బాబు

చిన్న వయసులోనే తల్లిని విడిచి ఇంటి నుంచి పారిపోయాడు కరుణ.

పిల్లలు ఇంటి నుంచి పారిపోవడానికి లక్ష కారణాలు ఉంటాయి. కాని పారిపోయిన పిల్లల తల్లుల వేదన మాత్రం ఒక్కటే. తల్లిని వదిలి, పలాసాను వదిలి, చెన్నైకి చేరిన కరుణకు తల్లి గుర్తుకు రాకుండా ఉంటుందా? తల్లిని క్షోభకు గురి చేసినందుకు పసిమనసులో కోత లేకుండా ఉంటుందా? ఏ తల్లయినా మంచిదే బిడ్డకు.

వాల్మీకీని ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని సాకమని భార్య కోరిందిగాని తల్లి కాదు. మరి నా పాపాల్లో భాగం తీసుకుంటావా అనంటే నేనెందుకు తీసుకుంటానని భార్య అనింది కానీ అదే మాట తల్లితో అనుంటే అన్నీ పాపాలూ నాకే ఇచ్చి నువ్వు చల్లగా బతుకు నాయనా అనుండేది.

కరుణ మనసులో ఈ తల్లి అంశ సగం ఉండిపోయింది. మిగిలిన అంశ అంతా కఠినమైన సమాజమూ, దాని నిర్దాక్షిణ్యత, దానితో నిర్వహించవలసిన కపటమూ, అది చేసే అవమానమూ, అది కార్పించే కన్నీరూ, ఒక స్త్రీని తోడు చేసుకొని సంసారాన్ని ఈదమని అది వేసిన బరువు, ఆ బరువు కింద ఏ మగాడికైనా తప్పని అవిముక్త నలుగుబాటు ... . ఇవన్నీ మరో సగము. అలా కరుణ కుమార్ చూసే జగత్తు ఒక స్త్రీ రూపంలో ఉంటూ సగం మంచితో సగం చెడుతో నిండిపోయింది. ఇంటి నుంచి పారిపోయేలా చేసిన చెడు... పారిపోయి వచ్చిన పిల్లాణ్ణి పాసిపోయిన ఇడ్లీ పెట్టయినా సరే పెంచి మళ్లీ ఇంటికి పంపిన మంచి.... ఇటు మొగ్గు అటు వెగటు................

  • Title :Savarla Konda
  • Author :Karuna Kumar
  • Publisher :Anvikshiki Publications
  • ISBN :MANIMN5982
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :157
  • Language :Telugu
  • Availability :instock