“హలో! సావిత్రి గారేనా?”
"హా నేనే, మాట్లాడుతున్నాను చెప్పండి."
“నేను షైన్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. సారీ మేడం. నేను మీవారి గురించి మాట్లాడుతున్నాను. మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఈ ఉదయం ఆయన చనిపోయారు. ఇంకో అరగంటలో ఫార్మాలిటీస్ పూర్తి చేసి డెడ్ బాడీని హ్యాండోవర్ చేస్తాం.. మీరెక్కడున్నారు...?”
"మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు...?” అది తనకు ఏమాత్రం సంబంధం లేని విషయం అన్నట్టుగా సమాధానం ఇచ్చింది. సావిత్రి. షాకింగ్ విషయం విన్న ఛాయలేవీ ఆమె గొంతులో వినిపించకపోవటంతో. తాను సరైన నంబర్కే కాల్ చేశానా అని అనుమానం వచ్చింది ఆ నర్స్కి.
"మీరు సావిత్రిగారు కాదా...?”
"అవును, నేను సావిత్రినే, కానీ మీరెవరి గురించి చెబుతున్నారో...............