సైన్స్ ఆఫ్ కాన్షస్నెస్
భారతదేశంలో ఆధ్యాత్మికత ఒక విశుద్ధమైన విజ్ఞానంగా రూపొందించబడింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దానివలన ఒక విధంగా రాబోయేటటువంటి భవిష్యత్ విద్యా విధానానికి బీజారోపణ జరుగుతుంది అన్నది అర్థం చేసుకొండి. ఆ భవిష్యత్ విద్య ఏంటి అంటే ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో ఆ విద్య మనం నేర్చుకోబోతున్నాం. పూర్వకాలంలో భారతదేశంలో ఈనాడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు, కమ్యూనికేషన్ సదుపాయాలు లేనప్పుడు కూడా భారతదేశానికి రావాలి అని మనుష్యులు కోరుకునేవారు. కొలంబస్ అమెరికాని కనుగొనటానికి బయలుదేరలేదు. ఇండియా వద్దామని ప్రయత్నం చేసి ఇండియా అనుకుని స్థిరపడిపోయిన దానికే ఇంత గౌరవం లభిస్తే, అసలు ఇండియాకి ఎంత గౌరవం ఉంటుంది? భారతదేశంలో ఈనాడు లాగా విషయాల్ని తెలిపే న్యూస్పేపర్లు, రేడియోలు, టి.విలు, ఒకచోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళటానికి కావలసిన ట్రాన్స్పోర్ట్ సదుపాయములు అవి ఏవీలేని కాలంలో భారతదేశము ఇంత గొప్పది అని ఎలా తెలిసింది? అంతే కాదు చుట్టురా మూడు వైపుల సముద్రము,.....................