ఆధ్యాత్మిక జగత్తులో వచ్చిన అద్భుతమైన మార్పు
పదార్ధాన్ని అధ్యయనము చేసే విజ్ఞానము ఈనాడు చాలా ప్రముఖ పాత్ర వహించటమే కాకుండా వైజ్ఞానిక దృష్టి కోణము లేని ఏ విషయము స్వీకరించలేని స్థితికి వచ్చాము. కేవలము నమ్మకము మీద ఆధారపడ్డ ఆధ్యాత్మికతకు తన అస్థిత్వాన్ని కోల్పోయే విషమ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మికత తిరిగి మానవజాతి జీవిత విధానపు మార్గదర్శక సూత్రంగా తిరిగి ప్రతిష్టించబడాలంటే ఆధ్యాత్మికత తన విలువలను, గౌరవాన్ని చాలా పెంచుకోవాలి.
ఆధ్యాత్మికత ప్రకారంగా ప్రకృతిలో రెండు శక్తులు పని చేస్తుంటాయి.
జీవితము తన పరిధిని పరిమితం చేసుకుంటూ చేరుకునే అత్యంత చివర దశను 'పదార్ధము' అని అన్నారు. ఒకే వస్తువు యొక్క ఒక ధృవము జీవిత సూత్రము (Life Principle) అయితే రెండవ ధృవము పదార్ధము. పదార్ధము పూర్తిగా జీవిత సూత్రముగా మారక ముందు జరిగే క్రమిక వికాసాన్ని చేతనత్వ వికాసము (Evolution of Consciousness) అని అంటాము. జీవితం ప్రకటీకరించబడుతూ ఉంటే చేతనత్వం వికాసం చెందుతూ ఉంటుంది.
ప్రకటీకృతమైన జీవితం యొక్క చేతన, తన వికాస శ్రేణిలో కీలకమైన 10 క్రమగత మెట్లు కలిగి ఉంటుందని మన 'అవతార' ప్రక్రియ తెలుపుతోంది. వీటిలో 7వ మెట్టు వరకు చేతనత్వం మీద పదార్ధము తన అధికారాన్ని నెరుపుతూ చేతనత్వానికి దిశను ఇచ్చే బాధ్యతని ప్రకృతే గైకొంటుంది అనగా పదార్ధములో వికాసము చెందుతున్న చేతనత్వము పూర్తిగా ప్రకృతి ఏర్పరచిన మూసలోనే జరుగుతుంది. కృష్ణావతారం వచ్చేసరికి జీవితం యొక్క ప్రకటీకరణ (Manifestation) లో పదార్ధము, చేతనత్వము సంతులన మొంది వికాస ప్రక్రియ ఒక సక్రియ సమతా స్థితిని చేరుకుంటుంది. అందువలన లోపల నుండి జీవితము నూతన ప్రేరణల్ని కల్గించకపోతే ఈ సమతా స్థితి అనంతకాలం పాటు కొనసాగుతూనే ఉంటుంది. దీనికి అంతు ఉండదు. ఈ స్థితినే 'జన్మ మృత్యు చక్రమని' చెబుతూ ఉంటాము. తొలి తుది బిందువులను.....................