అధ్యాయం - 1
అన్ని ప్రభుత్వ శాఖల్లో స్వార్ధ భట్ బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండటంవల్ల రైతులు మోసపోతున్నారు, వారి పిల్లలను పాఠశాలలకు పంపలేక పోతున్నారు. పంపగల్గిన స్తోమత వున్న కొద్దిమంది కూడా బ్రాహ్మణ భావజాలం వల్ల ప్రభావితులై పక్కదారి పడుతున్నారు.
నిరక్షరాస్యులు, వనరులులేని పేదరైతులు భట్ బ్రాహ్మణ భావజాలం వల్ల ప్రభావితం చేయబడినారు. ఆర్యబ్రాహ్మల కచ్చితమైన భావజాలంవల్ల ప్రభావితమై ఆ చట్రం నుండి బయటపడలేకపోతున్నారు. ఈ ప్రభావం వారి పుట్టుక దగ్గర్నుంచి “గర్భాదానం”గా మొదలయి వారి చావు తర్వాత "శ్రాద్ధ కర్మ వరకూ సాగుతుంది, ఎంతో పకడ్బందీ అయిన ఈ ఆచార వ్యవహారాల చట్రం వారిని ఇందులో బంధించింది.
మహిళ సమర్తాడినప్పటి నుండి ఈ తంతు మొదలౌతుంది, ఆమె బహిష్టు కావడం వల్ల మైల ఏర్పడిందని దాని నివారణకు పూజలు, ప్రార్ధనలు చేసి, భట్ బ్రాహ్మణులు, వారి బంధువులు రైతుల దగ్గర్నుంచి నెయ్యి, బియ్యం, గోధుమలు, ఇతర ధాన్యాలు పొందుతారు. ప్రతిగా వారు ఆ మహిళలకు శనివారం ఉపవాసం ఉండమని, చతుర్థి రోజు పూజలు నిర్వహించమని ఇది శుభమని చెప్పుతారు, ఇలాంటి తంతు జరిగే సమయాల్లో తమకు కావలసిన జీవన భృతిని వారినుండి మోసపూరితంగా కొట్టెయడంలో కృతకృత్యులవుతారు, రైతులు తమ ఆకలిని ఆపడం కోసం దాచుకొన్న ధాన్యము, ఇతరత్ర వస్తువులను వీరికి ఇచ్చివేస్తారు.
మహిళలు గర్భవతులయినపుడు, బ్రాహ్మణ పిల్లలు (వటువులు) వెళ్ళి దానాలను స్వీకరిస్తారు. ప్రసవానికి ముందు 'భట్ గారి భార్య రోజూ వెళ్ళి పుట్టబోయే బిడ్డ గొప్పవాడౌతాడని, కీర్తిని పొందుతాడని శ్లోకాలు చదివి తనకు కావలసినవి. పట్టుకొచ్చుకుంటుంది. పుట్టిన బిడ్డ మగ శిశువయితే ఈ బ్రాహ్మల పంట పండినట్టే, ఆ బిడ్డ జాతకచక్రాన్ని (పుట్టినవేళ, రోజును బట్టి) వ్రాసి అతని భవిష్యత్తు గురించి మాయ మాటలు చెప్పి దోపిడికి గురిచేస్తారు.
ఆర్య బ్రాహ్మణులు ఈ రైతులు పిల్లలను వారి సంస్కృత పాఠశాలలోకి అనుమతించరు. ఈ పిల్లలను కేవలం అలవాటుపడ్డం కోసం మాత్రమే పాఠశాలలోకి అనుమతిస్తారు. అవి - మరాఠీ - ప్రాకృత పాఠశాల, అక్కడ వారికి ఉత్తరాలు వ్రాయడం,......................