• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Seema Swaralu

Seema Swaralu By Dr V R Rasani

₹ 450

 కథల కాపరి వి.ఆర్. రాసాని

డా॥ వి.ఆర్. రాసాని కథకుడు, నవలాకారుడు, కవి, నాటకరచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, వక్త. ఆధునిక సాహిత్యానికి సంబంధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టిన రాసాని పల్లె జీవితాన్ని పుష్కలంగా అనుభవించాడు. నగరం చేరినా పల్లెతనాన్ని పోగొట్టుకోలేదు. పల్లె విజ్ఞానం ఆయనలో సజీవంగా ఉంది. గ్రామీణభారతం ఆయన సాహిత్యంలో విమర్శనాత్మకంగా ప్రతిబింబిస్తుంది. గ్రామీణ మానవ సంబంధాలు, వాటిలోని చీకటి వెలుగులు, వాటి మూలాలు, వాటి చుట్టూ ఆవరించిన చరిత్ర, సంస్కృతీ వలయాలు రాసాని సాహిత్యంలో స్వస్వరూపంతో దర్శనమిస్తాయి. రాసాని మోతుబరుల రచయితకాదు, శ్రామికుల రచయిత. శ్రమ జీవనసౌందర్యం తళుకుబెళుకులు లేకుండా రాసాని సాహిత్యంలో వాస్తవికంగా ప్రతిఫలిస్తుంది. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతం తెలుగుభాష ఆయన సాహిత్యంలో పరిమళిస్తూ ఉంటుంది. ఆయన సాహిత్యం చదువుతుంటే ఆయన మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఆయన సాహిత్యం చదువుతుంటే అది తెలుగు సాహిత్యంగానే అనిపిస్తుంది. విదేశీవాసనలు రావు. చేతిలో సంగటి ముద్దను, వేరుశెనగపప్పుల చెట్నీలో అద్దుకొని తింటున్నట్లు ఉంటుంది. కసిం కాలవ కట్టమీద కంపచెట్లమీదికి మేకలు ముందరికాళ్ళు చాపి కంపాకును నోటితో కొరికి నములుతున్నట్లు ఉంటుంది. వర్షాలు బాగా కురిసినప్పుడు మోట తోలకుండానే బావినీళ్ళు కాలవలోకి వచ్చినట్లుంటుంది. చిన్న రైతు పొద్దు మొలిచింది మొదలు పొద్దు కుంకేదాకా వంచిన నడుం ఎత్తకుండా పొలంలో పని చేస్తున్నట్లుంటుంది. గ్రామాల్లో పుట్టి చదువుకొని ఉద్యోగాలకోసం పట్నాలకు, నగరాలకు, విదేశాలకు వెళ్ళిన వాళ్ళకు రాసాని సాహిత్యం వాళ్ళు పుట్టిన ఊళ్ళను వాళ్ళముందు ప్రదర్శిస్తుంది. పల్లెవాసనే తెలియనివాళ్ళకు భారతదేశ అసలు రూపాన్ని ఆయన సాహిత్యం తెలియజేస్తుంది.

జీవితం నుంచి కథను, కథనుంచి పాఠకుల్ని పరాయీకరించే రచయితలకు కొడవలేదు. వాస్తవికతను విస్మరించి అవాస్తవికతకు యాంత్రికతకు పట్టంగట్టే...............

* సీమస్వరాలు *

* డా॥ వి.ఆర్. రాసాని *

  • Title :Seema Swaralu
  • Author :Dr V R Rasani
  • Publisher :Bala Pustaka Prachuranalu
  • ISBN :MANIMN6157
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :278
  • Language :Telugu
  • Availability :instock