• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Seeta
₹ 120

ప్రవేశిక

వైకుంఠంలో శ్రీలక్ష్మీదేవి ఎదుట కూర్చొన్నారు పరమ భగవద్భక్తులైన నారదులవారు. నారదుని వదనంలో మందహాస ముండినది. అయినా, బంగారపు బొమ్మవలె శోభిస్తున్న శ్రీలక్ష్మీదేవి ముఖంలో కొద్దిగా కోపమగుపడినది.

'అంతూ, కొంతమంది శ్రీహరి భక్తులు, అతని ఆజ్ఞాపాలకులు నాకెలాంటి సహాయం చేయరని తెలిసిపోయినది. కాని, నేను స్మరించగానే వచ్చారు కదా. అదే చాలు...' అన్నది, శ్రీ లక్ష్మీదేవి.

నారదులు కొద్దిగా నవ్వి,

'తల్లీ... నీవు జగజ్జననివి! నీకు మా సహాయం కావాలా? కనుబొమలు సైగతో మాత్రమే తృణాన్ని విరించి గానూ, విరించిని తృణంగానూ చేయగల మహాశక్తి శాలివి. ఇలాంటి మీకు...?' అని చెప్పు నంతలో...

శ్రీ లక్ష్మీదేవి..

'చాలు, చాలు. మీరు నన్ను పొగుడుతూ కాలం గడపకండి. రామాయణ కథ చాలా మొదటినుండే మీకు తెలుసని సనాతాదులు నాకు తెలిపారు. ఆ కథ ముఖ్యమైన వివరాలు నాకు తెలిపితే భూలోకం వెళ్ళడానికి నాకు ధైర్యం కల్గుతుంది. ఎందుకంటే, భూలోకంలో నేను అవతార మెత్తుతున్నది యిదే మొదలు. శ్రీహరైతే, యిప్పటికపుడే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవులుగా భూలోకంలో అవతార మెత్తారు. ఈమారు వారి అవతార విశేషాలేమిటి? అచ్చట నేను నిర్వర్తించాల్సిన పాత్ర ఎలాంటిది? విశదంగా వివరించండి' అని అడిగినది శ్రీ లక్ష్మీదేవి.

నారదులవారు, 'నారాయణ, నారాయణ' అని రాగంగా హరిస్మరణ చేసి,

'అన్ని విషయాలు తెలుసుకొని అభినయిస్తే ఏం బాగుంటుంది తల్లీ. ఈ విషయంలో మీరు అపరిచితురాలిగా వున్నట్టయితే, మీ మూలస్వరూప గుణాలకు మెరుగు వస్తుంద'ని తన మాటలను నిలిపారు.

'అంటే, మీరు శ్రీహరి భక్తులు, చాలావరకూ అతని ఆజ్ఞానువర్తులు, నాకేమిటి... అలా అయితే రహస్యం తెలుపరా?' అన్న శ్రీ లక్ష్మీదేవి ధ్వనిలో అసమాధానం నిండి వుండినది.

నారదులవారు నవ్వి,

'మేము శ్రీహరి భక్తులైతే, మీరెవరు తల్లీ? శ్రీహరి భక్తులలో ప్రప్రథమ స్థానం.............................

  • Title :Seeta
  • Author :Veluri Krishnamurty
  • Publisher :Pala Pitta Books Hyd
  • ISBN :MANIMN5798
  • Binding :Papar Back
  • Published Date :Aug, 2018
  • Number Of Pages :192
  • Language :Telugu
  • Availability :instock